M.V. SWAMY

Children Stories

4.5  

M.V. SWAMY

Children Stories

ప్రతిరోజూ పండగ రోజే

ప్రతిరోజూ పండగ రోజే

2 mins
275


      ప్రతిరోజు పండగ రోజే (చిన్న కథ)


      అక్కుమ్ బుక్కుమ్ ఊర్లో టిక్కీమ్ టక్కూమ్ అనే ఇద్దరు కవల సోదరులు ఉండేవారు.ఇద్దరూ ఎప్పుడూ సరదాగా సందడిగా వుండేవారు.తమ లాగే ఊర్లో వారు బంధువులు, మిత్రులు అందరూ సరదా సందడిగా ఉండాలని కోరుకునేవారు.


     ఒకరోజు ఆ ఇద్దరు కవల సోదరులూ వెరైటీగా ఉంటుందని నారదుడు గురుంచి కఠిన నియమాలు లేకుండా ఆడుతూ పాడుతూ తపస్సు చేశారు. టిక్కీమ్, టక్కూమ్ సరదా సందడి తీరుకి మెచ్చుకొని ఆలస్యం చెయ్యకుండా నారదుడు ప్రత్యేకమయిపోయి వరాలు కోరుకోమన్నాడు.


          వరాలు కోరుకోమన్న నారదుడు మహా జ్ఞాని అని తెలుసు కాబట్టి కవల సోదరులు తెలివిగా వరాలు కోరాలనుకొని, "దేవా మా లోకంలో సమస్త జీవులూ నిత్యం సంతోషాలతో ఉండాలి" అని కోరారు.నారదుడు కాసేపు ఆలోచించి, "లోకంలో కష్ట సుఖాలు కావడి కుండలు కాబట్టి లోకంలో నిత్య సంతోషాలు కుదరవు, ఏ ఏ కాలాల్లో సంతోషం కావాలో చెప్పండి" అని అన్నాడు."వర్షాకాలం,ఎండాకాలం, చలికాలం అలా కుదరకపోతే ఆరు ఋతువుల్లో మాకు సంతోషాలు కావాలి" అని కోరారు ఆ కవలలు."అదే కుదరదు,కొన్ని వారాలు పాటు మాత్రమే సంతోషాన్ని కోరండి" అని అన్నాడు నారదుడు."అలాగయితే...ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం మాకు సంతోషం ఇవ్వండి"అని కోరారు ఆ సోదరులు."అబ్బే అదికూడా జరగదు, రోజులు మాత్రమే కోరండి" అని అన్నాడు నారదుడు."అయితే నిన్నటి రోజు, నేటి రోజు, రేపటి రోజు సంతోషాన్ని ప్రసాదించండి స్వామి"అని అన్నారు టిక్కుమ్, టక్కూమ్."అమ్మో మీ తెలివి ముందు నా తెలివి తెల్లారి పోయేటట్లు ఉంది, కేవలం ఒక్క రోజు మాత్రమే సంతోషాన్ని కోరుకోండి, ఇదే చివరి అవకాశం, ఈ అవకాశం వదులుకొని నన్ను విసిగిస్తే నేను మాయమైపోతాను" అని అన్నాడు నారదుడు."అయితే ప్రతిరోజు మాత్రమే మా లోకానికి సంతోషాన్ని ఇవ్వండి ప్రభూ"అని టక్కున కోరారు ఆ సహోదరులు.


           టిక్కీమ్, టక్కూమ్ తెలివికి ఫిదా అయిపోయి పగలబడి నవ్వాడు నారదుడు,నవ్వు ఆపుకోలేక ఆపుకోలేక ఆపుకొని,"పిల్లలు కాదు మీరు సరదా సందడి, చమత్కార పిడుగులు,మీరు కోరిన వరాన్ని ఇస్తున్నాను,అయితే అందరూ మంచిపనులే చెయ్యాలి, మంచి ఆలోచనలుతోనే ఉండాలి,అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే భావనతో అందరూ ఉంటేనే నా వరం పనిచేస్తుంది, ఇక" ప్రతిరోజు సంతోషాల పండగే" మీ లోకంలో"అని మాయమాయ్యాడు నారదుడు. టిక్కీమ్, టక్కూమ్ సరదా సందడి చేస్తూ అక్కుమ్ బుక్కుమ్ ఊరికి చేరి ఈ లోకానికి నారదుడు ఇచ్చిన వరాన్ని అందరికీ చెప్పి, సంతోషాల సంబరాలు చేసుకున్నారు ఊరందరితో కలిసి.


     .......పృథ్వీ




Rate this content
Log in