M.V. SWAMY

Children Stories

3  

M.V. SWAMY

Children Stories

ప్రజాహిత

ప్రజాహిత

3 mins
458


       పూర్వం పాటలీపుత్ర రాజ్యాన్ని 'ప్రజాహిత' అనే రాజు పరిపాలిస్తుండేవాడు."వేలాది సంవత్సరాలు నుండి ఈ రాజ్యంలో రాజుల వంశపరంపర పాలన నడుస్తుంది,ఇది ప్రజాభిప్రాయానికి సంబంధం లేని పాలన అందుకే ఈ తరహా పాలనకు స్వస్తి చెప్పి క్రమంగా ప్రజారాజ్యం తీసుకురావాలి" అని ప్రజాస్వామ్య స్థాపనకు నిర్ణయించుకున్నాడు రాజు,అయితే "ముందుగా రాజు గద్దె దిగిపోయి ప్రజా స్వామ్యం తేవాలని ప్రయత్నిస్తే, అధికార దాహంతో రాజ వంశీకులు,మంత్రివర్గం,రాజ సభ ఉద్యోగులు ,సైనిక అధికారులు, ఇతర ఉన్నత ఉద్యోగులు, అధికారులు రాజ్యంలో పాలన అస్తవ్యస్తం చేసి అరాచకం సృష్టించే అవకాశం ఉంది కనుక ముందుగా రాజ్యపాలనలో అత్యంత కీలకమైన మహామంత్రిని వారసత్వం ద్వారా కాకుండా ప్రజలనుండి ఒక సమర్థుడని ఎంపిక చెయ్యాలి" అని అనుకున్నాడు రాజు.వున్న మహామంత్రికి స్వచ్చంద పదవీ విరమణ పథకం ద్వారా పదవినుండి తప్పించే ఏర్పాట్లు చేశాడు.


                మహామంత్రి పదవికి అర్హులైన యువతీ యువకులు నుండి దరఖాస్తులు ఆహ్వానించాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఎక్కవ దరఖాస్తులు మహిళలలు యువతులు నుండి వచ్చాయి. "ఎన్నడూలేనిది మహిళా మహామంత్రా! వద్దు అటువంటి చర్యలు వద్దు, మహామంత్రి పదవికి మహిళను అనర్హురాలిగా ప్రకటించండి" అని రాజు గారికి రాజ్యంలోని పెత్తందారులు నుండి సలహాలు సూచనలు వచ్చాయి.


                 "ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ సమాన అవకాశం ఇవ్వడం, ఇక్కడ ఆడ మగ తేడా ఏముంది" అంటూ రాజు ప్రజాహిత యువతీయువకులు అందరి దగ్గరగా ధరఖాస్తులుస్వీకరించాడు. మేథావులు, రాజ్యపాలనలో అపార అనుభవం ఉన్న విశ్రాంత అధికారులు, ఉన్నత విద్యావంతులు, రాజగురువుల్లో జన స్వామ్యాన్ని స్వాగతించేవారిని మహామంత్రి నియామక సంఘంగా ఏర్పాటు చేసి వారి సాయంతో అభ్యర్థుల తుది జాబితా తయారు చేసాడు. తుది జాబితాలో 'విశ్వవర్ధిని' అనే ఒక పేదింటి యువతి, 'వివేకి' అనే ఒక మద్య తరగతి కుటుంబాల యువకుడు, 'నవ నాగరిక' అనే ధనిక వర్గాల యువకుడు స్థానాలు సంపాదించుకున్నారు. తుది ఎంపిక అధికారాన్ని రాజుగారికే అప్పగించారు ఎంపిక సంఘం సభ్యులు.


                  రాజుగారు కాబోయే మహామంత్రిని ఎంపిక చెయ్యడానికి, ముగ్గురు అభ్యర్థులకు కొన్ని పరీక్షలు పెట్టదలిచాడు, ముగ్గురునీ పిలిచి "మీరు ముగ్గరూ కూరగాయలు బజార్లకు వెళ్లి కూరగాయలు కొని తేవాలి, అయితే ముగ్గురూ వేరు వేరుగా మూడు బజార్లకి వెళ్లి కూరగాయలు తేవాలి" అని ఒక్కక్కరికీ వంద బంగారు వరహాలు ఇచ్చి "ఎవరు తెలివిగా బజారు చేసి నన్ను సంతోష పెడతారో" అని ఆదేశించాడు రాజు. ముగ్గురూ మూడు ఊర్లలో జరుగుతున్న కూరగాయల సంతలకు వెళ్లారు. 'విశ్వవర్థిని' పక్కా పల్లెటూరు రైతుబజారుకు వెళ్లి వందవరహాలు ఖర్చు చేసి, తాజా తాజా కూరగాయలు తెచ్చింది.'వివేకి' ఒక పట్టణం పోయి పల్లెల నుండి దళారీలు తెచ్చిన కూరగాయలను సవాలక్ష బేరాలు ఆడి, చివరకు "రాజుగారు మనిషిగా వచ్చాను అర్ధం చేసుకోండి" అని వ్యాపారులను పరోక్షంగా బెదిరించి యాభై వరహాలకే విశ్వవర్ధిని తెచ్చిన కూరగాయలు కన్నా ఎక్కువ తెచ్చి, యాభై వరహాలు కూడా మిగిల్చి తన తెలివికి రాజు మెప్పు పొందాలని చూసాడు, ఇక మూడవ వాడు పాటలీపుత్రరాజధాని మహానగరంలోని మంచుముద్దల మద్య కూరగాయలను నిల్వ ఉంచే ఒక బడా వ్యాపారి కూరగాయల గిడ్డంగికి వెళ్లి రాజు ఇచ్చే వంద వరహాలకు మరో వందవరహాలు జతచేసి ఉన్న కూరగాయల్లో అత్యంత ఖరీదైన కూరగాయలను కొని రాజు ముందు ఉంచాడు.


               రాజుగారు సంతృప్తిగా గుండెనిండా ఊపిరి పీల్చుకున్నారు.రెండోరోజు 'విశ్వవర్ధిని'ని 'మహామంత్రిని' గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మేధావులు మొదలుకొని, మహా అనుభవజ్ఞులైన పెద్దలు కూడా రాజు నిర్ణయంపై వినయంగా రాజుగారి వివరణ కోరారు.


                  రాజు ప్రజాదర్భారులో మాటలాడుతూ..."మన రాజ్యంలో రాబోయే ప్రజాస్వామ్య రాజ్యానికి సమర్ధ మహామంత్రిని 'విశ్వవర్ధిని' , అన్నం పదును తెలుసుకోడానికి అన్నంమొత్తాన్ని పరీక్షచేయనక్కరలేదు ఒక్క మెతుకును పరీక్ష చేస్తే చాలు.మహామంత్రి పదవీ అభ్యర్థులు ముగ్గురు వెంటా నాకు నమ్మకస్తులైన వేగులను మారువేషంలో పంపాను, 'విశ్వవర్ధిని' నేరుగా చిన్నా సన్నకారు రైతులు వద్దకు వెళ్లి కూరగాయలు పండించడానికి రైతులు పడే కష్టాలు తెలుసుకొని, పంటకు గిట్టుబాటు ధర రావాలి ,రైతు కష్టానికి తగిన ఫలితం ఉండాలి అన్న ఉద్దేశ్యంతో రైతు నిర్ణయించిన ధరకే కూరగాయలు కొని తెచ్చింది, ఈ వ్యవహారంలో ఆమె రైతు మేలుకోరింది తప్ప రాజు మెప్పుకై అర్రులు చాచలేదు, ఇక 'వివేకి' తన అధిక తెలివిని ఉపయోగించి కూరగాయల దళారులు, వ్యాపారులును నయానో భయానో ఒప్పించి తక్కువ ధరకు ఎక్కువ కూరగాయలు తెచ్చి కొన్ని వరహాలు మిగిల్చి రాజు మెప్పు పొందడనికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు, నైతికత గాలికి వదిలేసాడు, చివరగా మూడో వ్యక్తి 'నవ నాగరిక' ఇతడు ప్రజాస్వామ్య రాజ్యానికి మహామంత్రిగా అనర్హుడు, నూటికి తొంభైమంది రైతులు, పేదలు, కూలీలు,కార్మికులు, నిరుపేద వర్గాలు ఉన్న ఈ రాజ్యంలో 'నవనాగరిక'Rate this content
Log in