M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

పింకీ 'కల'ర్ మాయాబజార్

పింకీ 'కల'ర్ మాయాబజార్

3 mins
499


        పింకీ 'కల'ర్ మాయాబజార్ (కథ)


       పింకీ పదో తరగతి చదువుతుంది, ఇంగ్లీష్ లెసెన్స్ లో మాయాబజార్ సినీమా గురుంచి మంచి కథనం ఉంది, అందుకే "వీలైతే ఆ సినీమా చూడండి" అని ఇంగ్లీష్ మాస్టార్ చెప్పడంతో "వరసగా రెండురోజులు సెలవులు వచ్చాయి ఆ సినీమా చూద్దాం కొంచెం రిలీఫ్ గా ఉంటుంది" అని పింకీ అనడంతో పింకీ నాన్న మాయాబజార్ కలర్ ప్రింట్ తెప్పించి డీవీడిలో వేశారు, అలా పింకీ కుటుంబసమేతంగా రాత్రి మాయాబజార్ సినిమా చూసింది. అందులో నటించిన నటీనటులు పేర్లు చాలా వరకూ పింకీకి తెలీవు. ఈ మధ్య మహానటి సినీమా చూసింది కాబట్టి సావిత్రి బాగా తెలిసిన నటిలా అనిపించింది పింకీకి, అలాగే 'మనం' సినిమాలో అక్కినేని నటన చూసింది కానీ అక్కినేని నూనూగు మీసాల అభిమన్యుడుగా అంత అందంగా చలాకీగా ఉండేవాడు అన్న సంగతి పింకీకి తెలీదు. ఇక ఎన్ టి ఆర్ ది పింకీకి పరిచయం చెయ్యనవసరం లేని ఫిగర్, రాజకీయ పార్టీ పోస్టర్స్, బేనర్స్ మీద తరుచూ చూస్తూనే ఉంది. అయితే ఎన్ టీ ఆర్ కృష్ణుడుగా అచ్చం దేవుడు విగ్రహాన్ని తలపించే విధంగా ఉంటాడని ఇప్పుడే తెలుసుకుంది. ఇక ఎస్. వి. రంగారావు పేరు వినడమే గానీ అతని సినిమాలు  కొంచి కొంచెం తప్ప పూర్తిగా ఎప్పుడూ చూడలేదు పింకీ, రేలంగి,గుమ్మడి, సూర్యకాంతం, ఛాయాదేవి, రమణా రెడ్డి, అల్లూ రామలింగయ్య పేర్లు వినివుంది కానీ వాళ్ళ సినిమాలు కూడా పూర్తి నిడివిలో ఎప్పుడూ చూడలేదు.


                పింకీకి మాయాబజార్ సినీమా తెగ నచ్చేసింది. అందుకే ఈ రోజు కూడా మరోసారి తాను ఒక్కతే సినీమాను వేసుకొని కేవలం ఎస్ వి ఆర్ ఘటోడ్కజుడుగా నటించిన వివాహాభోజనంబు వింతైన వంటకంబు పాటని రిపీటడ్ గా చూసింది, "ఇక చాల్లే" అని అమ్మ అనడంతో టీవీ ఆఫ్ చేసేసి, రిలాక్స్డ్ గా కునుకు తీసింది.


***** ****** ***** ***** ****** ******* ******


      పింకీ పెద్దమ్మ కూతురు లావణ్య పెళ్లికి వెళ్ళింది. అక్కడ పెళ్లి వంటలు జరుగుతున్న టెంట్లోనికి అనుకోకుండా వెళ్ళింది పింకీ, అక్కడ వంటలు చేస్తున్న పెద్దవాళ్లు అచ్చం అమ్మమ్మ చెప్పిన కథల్లో నలుడు, భీముడులా కనిపిస్తున్నారు, వాళ్ళు వంటలు చేస్తూనే ఉన్నారు ఘటోడ్కజుడు నిలబడి వంటలన్నీ తినేస్తున్నాడు. అక్క పెళ్లికి మహాభారతం కాలంనాటి ఘటోడ్కజుడు ఎందుకు వచ్చాడు, బహుశా ఇది నా భ్రమ అనుకుంది పింకీ."ఇది నీ భ్రమ కాదు నిజమే సోదరీ అంటూ పింకీ ముందుకు వచ్చి, "నువ్వు నా అభిమానివి వివాహాభోజనంబు... వింతైన వంటకంబు, గీతాన్ని పలుమార్లు వీక్షించావు, అందుకే నిన్ను మెచ్చి నీకు కనిపించడానికే ఇక్కడకు వచ్చాను,నీకు నచ్చిన వరం కోరుకో" అని అన్నాడు ఘటోడ్కజుడు, తనదైన స్టైల్లో బిగ్గరగా నవ్వుతూ, పింకీ ఉబ్బితబ్బిబ్బు అయ్యింది,వెంటనే "సార్ మాకు ఎక్కువ హోమ్ వర్క్స్ ఉండకూడదు, స్టడీ హవర్స్ విసిగించకూడదు, కష్టంగా కాకుండా, మేము ఇష్టంగా చదువుకునే పద్ధతి ఉండాలి 10/10 మార్క్స్ వస్తేనే గొప్ప లేకపోతే, జీవితాలే నాశనం అయిపోతాయి అనే భావన అమ్మకీ నాన్నకీ ఉండకూడదు, ఆయినా మా తలిదండ్రుల ఆశలు ఆశయాలు నెరవేర్చే మంచి కూతురుగా నేను తయారవ్వాలి, మా తరగతిలో పిల్లలందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఒత్తిడిలేని మంచి గుణాత్మక విద్యను అందించే బడిగా మా బడికి పేరు రావాలి, అందరూ బాగుండాలి అందులో మేముండాలి... అంతే ఇంకేమీ కోరిక లేదు సార్" అని ఘటోడ్కజుడుకి దండం పెట్టింది పింకీ. అతను బిగ్గరగా నవ్వుతూ "తథాస్తు సోదరీ నీ ఉత్తమ ఆశయాలు నెరువేరుగాక" అని మాయమాయ్యాడు.


******   ******* ****** ***** ****** *****


        "పింకీ ఓ పెంకీ ఇక నీ మాయాబజార్ రంగుల కలలు అయిపోయాయా, ఇక లెగు" అని అమ్మ పింకీకి తట్టి నిద్రలేపింది. పింకీ నిద్రలేచి చూసేసరికి, పింకీ ఇంట్లోనే ఉంది, అక్క పెళ్ళీలేదు, ఘటోడ్కజుడు ఎపిసోడూ లేదు తాను కల కన్నానని తెలుసుకొని,"అమ్మా మంచి కలే నువ్వే చెడగొట్టావు" అని అంది పింకీ బుంగమూతి పెట్టి, "నిజంగా మంచి కలే,కలలో నీ కోరికలన్నీ చెప్పేశావు, నువ్వు కలలో ఘటోడ్కజుడుని కోరిన వరాలు విన్నాం, నీ కోరికలు నిజం చెయ్యడానికి మేము నీకు సహకరిస్తాము, మీ నాన్నగారు ఈ మధ్య మీ బడికి వచ్చి, పరీక్షల ప్రిపరేషన్ పిల్లలకు కష్టంగా కాకుండా ఇష్టంగా ఉండేటట్లు చూడండని టీచర్లును రిక్వెస్ట్ చేస్తారులే, ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉండు అంతా మంచే జరుగుతుంది" అని అమ్మ అంది. పింకీ అమ్మకి నాన్నకి థాంక్స్ చెప్పింది. ఇంటిల్లపాదీ కూర్చొని అమ్మ చేసిన పాయసం, పులిహోరా, బూరెలు, గారెలు, బొబ్బట్లు నిదానంగా తింటూ "మా అమ్మ వంటకంబు.... పసందు వంటకంబు" అంటూ సరదాగా పాడుకున్నారు. సరదాగా హృదయపూర్వకంగా నవ్వుకున్నారు.Rate this content
Log in