STORYMIRROR

Keerthi purnima

Children Stories Comedy Drama

3  

Keerthi purnima

Children Stories Comedy Drama

పార్వతీశం హోటల్ కి వెళితే 12

పార్వతీశం హోటల్ కి వెళితే 12

1 min
202

పార్వతీశం ఒక హోటల్ కి వెళ్ళాడు...చాలా ఆకలిగా వున్నాడు...తను బారిష్టరు పూర్తి చేసి తిరిగి వెళ్తున్న సంతోషం కూడా వుంది...వెళ్ళే ముందు కడుపు నిండా తిని వెల్దాం అనుకుంటాడు ...


తనకి వచ్చి రాని హిందీ లో...

ఇదిగో లడ్క... ఇదర్ క్యా హే ....అని అంటాడు...

తను కిందికి వెలు చూపిస్తూ అడిగే సరికి.. ఆ పిల్లవాడు టేబుల్ మీద ఎం వుంది అని అడుగుతున్నాడు అనుకోని...


కుచ్ బి నహీ హే అని అంటాడు...


ఎం లేదు అంటావు ఏమిటి రా.మరి హోటల్ ఎందుకు పెట్టుకున్నావు అని అంటూ. .చేతితో సైగ చేసాడు తినడానికి ఎం వున్నాయి అని..


ఓ.... కానే కెలియే చాహియే అని అంటాడు ఆ పిల్లవాడు..


హమ్మయ్య ఇప్పటికీ ఆయన అర్ధం అయ్యింది అని అనుకొని హా....అని అంటాడు...


వాడు లిస్ట్ చెప్తాడు....


దహి వడా,పరోటా,పావ్ బాజీ....అని చెప్తూ వుంటాడు...


పార్వతీశం అవి వింటూ ఉంటే తనకి అవి సగం అర్ధం అవుతుంది...మిగితా ది అర్ధం కాలేదు..


వడ తెలుసు కాని దాహి అంటున్నడు,రోటీ అంటే రొట్ట ముక్క సరే పరోటా ఏమిటో...కూరగాయలు జికి నట్టు పావు బజ్జీ అంటున్నాడు.... ఏమిటో అంతా అయోమయం.ఇడ్లీ లో, ఉతప్పాం లాంటివి వాడి లిస్ట్ లో లేవు .....ఏదయితే అది ఆకలి కి ఎలుకల బదులు ఏనుగులు పరిగెడుతున్నాయి అని అన్ని ఓ ప్లేట్ ఆర్డర్ చేసి అరగిస్తాడు పార్వతీశం ...






Rate this content
Log in