Meegada Veera bhadra swamy

Children Stories

4.5  

Meegada Veera bhadra swamy

Children Stories

ఓ తండ్రి కథ

ఓ తండ్రి కథ

3 mins
513



అమాత్యులపేటలో అప్పలాచారి అనే బంగారం వ్యాపారి ఉండేవాడు, నగలు తయారుచెయ్యడం ,అమ్మడం తానే చేస్తుండటంతో అతనికి లాభాలు ఎక్కువగానే వస్తుండేవి, అతడు సుమారు ముప్పై సంవత్సరాలు రేయింబవళ్ళూ కస్టపడి డబ్బు బాగా సంపాదించాడు, అప్పలాచారికి ఇద్దరు కొడుకులు, ఇద్దర్ని తనంతటివాళ్ళను చేయాలనే తలంపుతో ఉండేవాడు అప్పలాచారి , అప్పలాచారి డబ్బుని కస్టపడి, తెలివిగా వ్యాపారం చేసి సంపాదించాడు కానీ.. ఎవ్వరినీ మోసం చేసేవాడు కాదు,తనకున్న మంచి పేరు, పలుకుబడిని ఉపయోగించుకొని వ్యాపారాన్ని విస్తరించి, కోటీశ్వరుడు అయ్యాడు, ఒక పేదింటి బిడ్డ అప్పలచారి కోటీశ్వరుడు అయినా తన మూలాలు ఎప్పుడూ మరిచిపోలేదు, తనకు కూడు పెట్టి కష్టకాలంలో ఆదుకున్న తన చేతి వృత్తిని ఏనాడూ వదులుకోలేదు, కోట్ల రూపాయులు సంపాదిస్తున్న సమయంలో కూడా రోజులో కొంత సమయం తన చేతి వృత్తికి కేటాయించేవాడు అతడు, తలిదండ్రులకు, పెద్దలకు, బంధుమిత్రులకు ప్రేమాభిమానాలు అందించేవాడు, పేదసాదలకు సాద్యమైనంత సాయం చేస్తుండేవాడు, అప్పలాచారి వయసు రీత్యా “ఏంతో మానసిక, శారీరక ఒత్తిడితో కూడిన వ్యాపారం ఇక చెయ్యలేను” అని ఇద్దరు కొడుకులనూ పిలిచి “మీకు విద్యాబుద్దులు నేర్పించాను,కులవృత్తిని ఎలా కాపాడుకోవాలో చూపించాను, ఎవ్వరికీ అన్యాయం చెయ్యకుండా, మోసం చెయ్యకుండా, నష్టాలు రాకుండా న్యాయమైన లాభాలుతో వ్యాపారాన్ని తెలివిగా చేసి కస్టపడి ఎలా డబ్బులు సంపాదించాలో.. నా జీవితం ద్వారా మీకు చూపాను, మీరు నా కన్నా గోప్పవాళ్ళు కావాలన్నదే నా కోరిక నాకూ.. మీ అమ్మకూ చెడ్డ పేరు తేకుండా సమాజాన్ని మోసం చెయ్యకుండా, కస్టపడి శక్తి యుక్తులుతో వ్యాపారాన్నీ, చేతి వృత్తినీ కొనసాగించి, పది మందికి ఉపాది ఇచ్చి, పెదసాదలకు సాయపడి, బుద్దిగా వుండండి” అని తన ఆస్తికి సంబదించిన పత్రాలను కొడుకులకు అప్పగించాడు, కొన్నాల్లు వరకూ అప్పలాచారి కొడుకులు తండ్రి సూచనలు మేరకే వ్యాపారం చేసి తరువాత “ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, తండ్రిలా నిజాయితీగా వ్యాపారం చేస్తే మనం అపర కుభేరులం కాలేము” అని ఇద్దరూ అనుకోని, తండ్రికి తెలియకుండా దొంగ బంగారం కొనడం, అమ్మడం నాసిరకం బంగారాన్ని అమ్మి కొనుగోలుదారులను మోసం చెయ్యడం, కులవృత్తి చేస్తే తోటి వ్యాపారులు దగ్గర చిన్నతనమని కులవృత్తిని పక్కన పెట్టడం చేసారు, పనివాళ్లకు తక్కువ వేతనం ఇవ్వడం,పెదసాదాలు సాయమడిగితే “పాత రోజులు పోయాయి ఇది అప్పలాచారి జమానా కాదు డబ్బులు పంచడానికి, ఇకపై ఎప్పుడూ మమ్మల్ని సాయం అడగవద్దు” అని ఈసడించుకోవడం చేస్తుండేవాడు, కొన్నాళ్ళకు కొడుకులు తీరు అప్పలచారికి తెలిసి పోయింది, “తీరు మార్చుకోండి లేకపోతే కూటికి గతిలేనివారు అయిపోతారు” అని చాలా సార్లు కొడుకుల్ని హెచ్చిరించాడు అప్పలాచారి, అతనిభార్య కొడుకుల్ని పిలిచి “తండ్రి మాటవిని బుద్దిగా వుండండి లేకపోతే కస్టాలు కొని తెచ్చుకుంటారు మీరు “అని పలుమార్లు తీవ్రంగా మందలించింది, అయినా కొడుకులు తీరు మారలేదు “మీరు మాకు ఆస్తి ఇచ్చారు ఇక మీ బాధ్యత తీరిపోయింది, మీరు మేము పెట్టిన తిండీ బట్టా తీసుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి, మా వ్యవహారాల్లో తల దూర్చకండి, మీకు తిండికీ బట్టకీ ఇతర అవసరాలకూ ఏదైనా లోటు వుంటే అడగండి , మా వ్యాపార వ్యవహారాల జోలికి రాకండి “ అని పరోక్షంగా హెచ్చిరించారు తలిదండ్రులను అప్పలాచారి కొడుకులు, ఆరు నెలలు తరువాత అప్పలాచారి కొడుకులకి కోర్టు నుండి నోటీష్ వచ్చింది “మొత్తం ఆస్తిని తిరిగి తలిదండ్రులకు అప్పగించమని అలా చెయ్యని పక్షంలో బలవంతంగా ఆస్తిని కోర్టు స్వాదీనం చేసుకొని మిమ్మల్ని జైలుకి పంపుతుంది”అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది, అప్పలాచారి కొడుకులు అతాసుతులయ్యారు, సమాజం ఆశ్చర్యపోయింది ,అప్పలాచారి కొడుకులు తలిదండ్రులను నిలదీశారు,”మీరు మేము మీకు ఇచ్చిన ఆస్తిని సద్వినియోగం చేసుకోవడంలేదు ,అందుకే మేము కోర్టుకు వెళ్లి మా ఆస్తి మాకు తిరిగి వచ్చేటట్లు కోర్టుని కోరాం, కోర్టు సరైన తీర్పు ఇచ్చింది, మేము మీకూ మీ కుటుంబాలకు నిత్య అవసరాలకు కావలసినంత ఆస్తిని మాత్రమే ఇస్తాము, మిగిలినది సమాజానికి రాసి దానం చేస్తాం, మీరు మీ కుటుంబాలూ కష్టపడి మేము ఇచ్చిన కాస్త ఆస్తినే పెంచుకొండి, తేరగా వచ్చిందని మీరు మేము నిజాయితీగా సంపాదించిన ఆస్తిని దుర్వినియోగం చేస్తే ఊరుకోము” అని ,కోడుకులు ఎన్ని విధాలుగా ఒప్పించడానికి ప్రయత్నించినా అంగీకరించకుండా, కొడుకులు కుటుంబాలకు నిత్య అవసరాలకు సరిపడా ఆస్తిని ఇచ్చి ,మిగిలిన ఆస్తిని ప్రేమసమాజాలకు ఇచ్చి, వాళ్ళు వృద్ధాశ్రమాలకు చేరారు అప్పలాచారి దంపతులు, “ఓ తండ్రి తీర్పు బాగుంది” అని ప్రజలు మెచ్చుకున్నారు. ఇది పిల్లలకు చక్కని పాఠమని సమాజం గుర్తించింది.



Rate this content
Log in