M.V. SWAMY

Children Stories

3  

M.V. SWAMY

Children Stories

మిత్రులు మధ్య ఈర్ష్యా ద్వేషాలు

మిత్రులు మధ్య ఈర్ష్యా ద్వేషాలు

2 mins
459



     మిత్రుల మద్య ఈర్ష్య ద్వేషాలు వద్దు (కథ)


ఒక వనంలో ఒక నెమలివుండేది, వనంకి ఒక పక్కన ఉన్న కొలనులో ఒక హంసవుండేది, వనానికి మరో పక్క ఉన్న గుట్టల్లో ఒక కుందేలు ఉండేది. నెమలి, హంస, కుందేలు స్నేహంగా ఉండేవి, క్రూరజంతువులు, వేటగాళ్ళూ వస్తే నెమలి కుందేలు హంస ఐక్యంగా వుంటూ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకునేవి, ఈ మిత్రులు ఎప్పుడైనా ఎక్కడికైనా కలిసి వెళ్తే కొందరు నెమలిని పొగిడితే, ఇంకొందరు హంసను ప్రశంసించేవారు. మరికొందరు కుందేలును అభినందించేవారు. కొన్నాళ్ళకు మిత్రులు మద్య ఈర్ష్యా ద్వేషాలు వచ్చాయి, ఒకరి మీద మరొకరికి అసూయ పుట్టింది, అయితే ఆ కుళ్ళూ కపటం బయట పడకుండా ఎవరికివారు జాగ్రత్తగా వుంటూ ఒకరంటే మరొకరికి అభిమానం ప్రేమ వాత్యలయం ఉన్నట్లు నటించేవి.పైకి మిత్రత్వం కనబరుస్తూనే అవకాశం వస్తే అందచందాల్లో...ప్రతిభా పాటవాల్లో పోటీ తగులుతున్న మిత్రులను అడ్డు తొలగించుకొని ఆ ప్రాంతంలో తానే అందమైన తెలివైన చురుకైన జీవిగా అందరిచేతా ప్రశంసలు పొందాలనే కోరికతో అటు నెమలి ఇటు హంస మరోవైపు కుందేలు మనసులో గట్టిగా అనుకునేవి. వన మహోత్సవం రోజుని ఘనంగా జరుపుకోవాలని బయటకు నిర్ణయించుకొని లోలోపల అదే రోజు మిత్రులు అంతం చెయ్యాలని నెమలి హంస కుందేలు మదిలో ప్రణాళికలు రచించుకున్నాయి. అయితే విందు పేరిట విషాహారం మిత్రులకు పెట్టి చంపేయాలని ముగ్గురు మిత్రులు వేరువేరుగా కుట్రల రచనలు చేసుకున్నాయి, వనానికి కాస్తా దూరంగా ఉండే నాగుపాము వద్దకు ముగ్గురు మిత్రులూ ఒకరికి తెలియకుండా మరొకరు వెళ్లి విషాన్ని ఆడిగాయి. అలాగే ఆ రహస్యం ఎవ్వరికీ తెలీకూడదు అని పాముని బ్రతిమిలాడుకున్నాయి. కోరల్లో విషమున్నా గుండెల్లో మంచి బుద్ది ఉన్న ఆ నాగుపాము ఉపాయంతో అపాయాన్ని తప్పించి, మిత్రులకు జ్ఞానోదయం కలిగించాలని విషమే అన్న నమ్మకం కలిగించి చిక్కటి ఆకు పసరను నెమలకి, హంసకు, కుందేలుకు ఇచ్చింది. ముగ్గురు మిత్రులుకు బుద్ది చెప్పడానికి సహకరించమని ఒక కోతిని కోరింది. అందరూ అనుకున్నట్లే విందు మొదలైంది. హంస పాల పాయసం, కుందేలు కేరట్ హల్వా, నెమలి పండ్ల రసం తెచ్చాయి అందులో నాగుపాము ఇచ్చిన రసాన్ని బాగా కలిపి మరీ తెచ్చాయి. విందులో "మిత్రులారా మీరు ముందు విందు ఆరగించండి అంటే మీరే ముందు విందుని స్వీకరించండి అని ముగ్గురు మిత్రులూ విందు తినకుండా మిగతా ఇద్దరు మిత్రులకూ విషాహారం ఇచ్చి చంపడానికే తెగ ప్రయత్నిస్తూ ఉండగా, కోతి అక్కడకు వచ్చి పాయసాన్ని, హల్వాని,పండ్ల రసాన్ని తినేసింది. నెమలి,హంస, కుందేలు కిక్కురుమనకుండా బిక్కచచ్చిపోయాయి.

బండారం బయట పడిపోతుందని హడలి పోయాయి. కోతి చనిపోయినట్లు నటించింది. కాకులు గోలగోల చెయ్యగా వనం చుట్టు పక్కలవున్న పక్షులు, పాములు, జంతువులు అక్కడ మూగాయి, నెమలి,హంస, కుందేలు పెట్టిన విందు తిని కోతి చనిపోయిందని కాకులు దండోరా వెయ్యగా "అందంగా ఉండగా సరిపోదు మనసు మంచిగా ఉండాలి, చూడటానికి పైకి బాగానే వున్నారు, బుద్ధి మాత్రం గడ్డి తిన్నట్లు ఉంది" అని ముగ్గురు మిత్రులకూ చీవాట్లు పెడుతుండగా. అక్కడకు వచ్చిన నాగుపాము ఈ ముగ్గురులో ఎవరూ విషాహారం తేలేదు, వీళ్లకు తెలీకుండా నేనే చెట్టుమీద కూర్చొని వీళ్ళు తెచ్చిన ఆహారంలో విషపు చుక్కలు వేశాను తప్పు నాదే నన్ను క్షమించండి, నా విషం అంత ప్రమాదం కాదు ,ఇంకా కోతి చనిపోలేదు, నాకు తెలిసిన కొన్ని ఆకులను తెస్తాను రసం పిండి కోతికి పట్టండి కోతి బ్రతుకుతుంది అని ముగ్గురు మిత్రులు ఎవరికి వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడి బుద్ది తెచ్చుకోడానికి అవకాశం ఇచ్చి, ముగ్గురు మిత్రులు పట్ల ఇతరులకు ఉన్న గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూసింది పాము,పాము చెప్పినట్లు ఆకుల రసం జంతువులు కోతికి త్రాగించగా కోతి బ్రతికినట్లు లేచి కూర్చింది,నాగుపాముని కాస్తా మందలించి అన్ని జంతువులు, పక్షులు, పాములు అక్కడ నుండి కదిలాయి. పాముకి కృతజ్ఞతలు చెప్పాయి నెమలి, కుందేలు, హంస. "ఇకపై బుద్దిగా, మంచి మిత్రులుగా ఉండండి "అంటూ వెళ్లిపోయాయి, కోతి, పాము.తాను చేసిన విషం పాపం ఎవ్వరికీ తెలియలేదు ఇకపై ఇలాంటి బుద్ధి తక్కువ చెడ్డ పని చెయ్యకూడదు, మిత్రులు మద్య అభిమానం ఉండాలి తప్ప ఈర్ష్య కూడదు అనుకుంటూ... ముగ్గురు మిత్రులూ ఎవరి మనసుల్లో వాళ్లే అనుకుంటూ.... మునిపటిలా కలిసిమెలిసి కల్మషం లేకుండా సహజీవనం చేయసాగాయి ప్రాణమిత్రత్వంతో...



Rate this content
Log in