M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

కథకో నెమలీక

కథకో నెమలీక

2 mins
380


      


   బుజ్జి మూడో తరగతి చదువుతుంది. బుజ్జికి బడికి వెళ్లడమంటే బద్ధకంగా ఉండేది. బుజ్జిని బడికి పండమే పెద్దపనిగా ఉండేది బుజ్జి ఇంట్లోవాళ్ళకి.బుజ్జి బడి ఉపాద్యాయులు, బుజ్జి అమ్మా నాన్న చాలాసార్లు సమావేశమై బుజ్జికి బడి అంటే భయం పోగొట్టడం ఎలా అని అంశంపై చర్చించుకున్నారు, ఆటలు పాటలు ఆనంద వేదిక కార్యక్రమాలు ఇన్ని వున్నా బుజ్జిని బడి ఆకట్టుకోలేకపోతుంది,బడిలో ఆమెను బలవంతంగా కూర్చోబెట్టినా... నిత్యం ఏడుస్తూ కూర్చోవడం తప్ప చదువు, ఆటపాటల పట్ల ఏమాత్రమూ ఆసక్తి చూపేదికాదు ,అసలు ఆ అమ్మాయిని బడిలో ఉంచే మార్గమెంటో అని ఒకసారి ఉపాధ్యాయులు తీవ్రంగా ఆలోచించి,ఉపాధ్యాయులే బుజ్జి ఇంటికి వెళ్లి, బుజ్జిగురుంచి కేస్ స్టడీ చేశారు.


            బుజ్జికి కథలు, బాలగేయాలు వినడం, చెప్పడం ఇష్టం, అన్నింటికన్నా బుజ్జికి నెమలీకలు అంటే చాలా చాలా ఇష్టమని కేస్ స్టడిలో తేలింది. వెంటనే బడిలో కథలు మాస్టారుగా పేరున్న ఆచారి గారికి 'బుజ్జిని బడికి రప్పించి, బడిలో సంతోషంగా కూర్చునే విధంగా మార్చే' భాధ్యతను అప్పగించారు హెచ్ ఎమ్ గారు.


            ఆచారి మాస్టారు, బుజ్జి నాన్నమ్మ వద్దకువెళ్లి, బుజ్జి విషయంలో ఆమె సహకారాన్ని కోరారు. వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం, బుజ్జికి నాన్నమ్మ ఇంటిదగ్గర ఒక కథ చెబితే బుజ్జి ఆ కథను బడి ప్రార్ధనా సమయంలో చెప్పాలి,అందుకు కానుకగా బడి ఉపాధ్యాయులు ఆమెకు ఒక నెమలీక ఇస్తారు, అలాగే బడిలో ఆచారి మాస్టారు ఒక గేయం చెబితే దాన్ని బుజ్జి ఇంట్లో పాడి వినిపించాలి, అందుకు కానుకగా ఇంట్లోవాళ్ళు ఆమెకు ఒక నెమలీక కానుకగా ఇవ్వాలి. నెమలీకలును సేకరించి,బడిలో కొన్ని, ఇంట్లో కొన్ని ఇచ్చే బాధ్యతను బుజ్జి తండ్రి తీసుకున్నాడు.


           బుజ్జికి కథల పోటీని అలవాటు చెయ్యడానికి, పిల్లల చెప్పే కథలు పోటీని బడిలో పెట్టి బుజ్జి చూస్తుండ గానే కథలు,గేయాలు పోటీల విజేతలకు నెమలీకలు బహుమతిగా ఇచ్చారు ఉపాధ్యాయులు. ఆ రోజు బుజ్జి ఆ పోటీలో పాల్గోలేదు కానీ ఏడుపు మానేసి కథలు, గేయాలు ఆసక్తిగా వినడం ఉపాధ్యాయులు గమనించారు. రోజూ కథలు, గేయాలు పోటీలు వుంటాయని ఉపాధ్యాయులు ప్రకటించారు. సాయింత్రం బుజ్జి తానే స్వయంగా నాన్నమ్మను బ్రతిమిలాడి రెండోరోజు కథల పోటీ గురుంచి ఒక మంచి కథను నేర్చుకుంది.


  రెండో రోజు ప్రార్ధనా సమయంలో రోజుకో నీతి కథ చెబితే కథకో నెమలీక కానుకగా ఇస్తామని చెప్పారు హెచ్. ఎం గారు,ఆ రోజు బుజ్జి, నాన్నమ్మ చెప్పిన మంచి కథను ప్రార్ధనా సమయంలో చెప్పి నెమలి ఫించన్ని బహుమతిగా పొందింది,ఆచారి మాష్టారి దగ్గరకు వెళ్లి రోజూ నేనే కథలు చెబుతాను నాకే నెమలీకలు ఇవ్వండి అని కోరింది అమాయకంగా."సరే నేను కూడా నీకు బాల గేయాలు నేర్పుతాను నువ్వు ఇంట్లో వాళ్లకు వినిపించి, నెమలీకలు అడుగు అని సలహా ఇచ్చారు. బుజ్జి అందుకు ఉత్సాహం చూపింది, అది మొదలు బుజ్జి బడి మానలేదు, సెలవులు వద్దు రోజూ బడి ఉంటే బాగుంటుంది అని స్నేహితులుతో అనేది ,అంతేకాదు బుజ్జి అతి తక్కువ కాలంలోనే బడిలో చురుకైన, తెలివైన బాలికగా మారిపోయింది.కొన్నాళ్లకు బుజ్జి వద్ద నెమలీకలు ఎక్కువ అయిపోయాయి, నేను చెప్పిన కథకు,గేయానికి బడిలో వాళ్ళు,ఇంట్లో వాళ్ళు చప్పట్లు కొట్టి తనని అభినందిస్తే చాలు ఇక నాకు బహుమతులు, కానుకలు వద్దు అని తన కోరికను చెప్పింది బుజ్జి, కథకో నెమలీక ప్రయోగం బాగా పని చేసింది అని అందరూ సంతోషించారు.


     





Rate this content
Log in