Meegada Veera bhadra swamy

Children Stories

3  

Meegada Veera bhadra swamy

Children Stories

గాంధీలు పుట్టినరోజు

గాంధీలు పుట్టినరోజు

3 mins
465



  


ఒక ఊర్లో మహాత్మాగాంధీ అనే బియ్యం వ్యాపారి ఉండేవాడు.గాంధే జయంతి రోజన పుట్టాడు. తాతతండ్రులు భారత జాతిపిత స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వీరాభిమానులు.అందుకే ఒక్కగానొక్క వారసుడుకి గాంధీ అని పేరు పెట్టుకున్నారు.ఈ గాంధీని ఆఊర్లోవాళ్ళు ముద్దుగా మహాత్మాగాంధీ అని పిలవడం అలవాటు చేసుకున్నారు.ఇంటిపేరు హీరా కాబట్టి చాలా మంది హీరా గాంధీ అని పిలిచేవారు.హీరా గాంధీకి మంచి విద్యాబుద్ధులు నేర్పారు తలితండ్రులు, తాతముత్తాతలు వ్యాపారస్తులైనా నీతి నిజాయిత గల వ్యాపారులుగా పేరు పొందారు,వ్యాపారంలో మా కున్న మంచి పేరు, ముఖ్యంగా జాతిపిత స్వర్గీయ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ పేరుకు ఉన్న ప్రాధాన్యత గౌరవం దృష్టిలో పెట్టుకొని వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాదించమని, వినియోగదారులే మనకు దేవుళ్ళు వాళ్లకు మోసం చెయ్యకుండా తక్కువ లాభాలతో అసలు నష్టాలే లేకుండా తెలివిగా వ్యాపారం చెయ్యమని హీరా గాంధీ ఇంటి పెద్దలు ఆతనికి హితవు చెప్పారు.


            హీరా గాంధీ బియ్యం వ్యాపారాన్ని ఎంచుకున్నాడు, సొంతగా రైస్ మిల్లులు కట్టుకొని రైతులు దగ్గర ధాన్యం కొని బియ్యం ఆడించి పెద్ద చిన్న అన్న తేడాలేకుండా అందరు వ్యాపారులకూ బియ్యం అమ్ముతూ,ఆ ప్రాంతంలో పెద్ద రైస్ మిల్లర్ గా పేరు పొందాడు,దేశ విదేశాలకు అతడు బియాన్ని ఎగుమతి చేసేవాడు.వ్యాపారంలో మంచి స్థాయిని అందుకున్నాడు, డబ్బులు బాగా సంపాదించాడు,హీరాగాంధీ కేవలం జాతిపిత గాంధీ పేరు వల్లే నాకు ఈ హోదా వచ్చిందని జాతిపిత మహాత్మాగాంధీకి ఒక ఆలయాన్ని కట్టించాడు, గాంధీ విగ్రహాన్ని బంగారంతో చేయించాడు, రోజూ దీపధూప నైవేద్యాలు గాంధీగుడిలో పెట్టించేవాడు.గాంధీ జయంతి రోజున చుట్టుపక్కల గ్రామాలకు తన గ్రామస్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసేవాడు, గాంధీ వర్ధంతి రోజు పేదలకు వస్త్రదానం,చేసేవాడు, సర్వమత ప్రార్ధనలు జరిపించేవాడు.


                  హీరా గాంధీకి సరిగ్గా అక్టోబర్ రెండవ తేదీనే ఒక కూతురు పుట్టింది, ఆమె జాతిపిత గాంధీ ఆశీస్సులు వల్ల జన్మించింది అన్న నమ్మకంతో జాతిపిత గాంధీకి ఇష్టమైన పెంపుడు కూతురు భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరును ఆమెకు పెట్టాడు,హీరా ఇందిరాగాంధీ ఇప్పుడు పదోతరగతి చదువుతుంది, జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున తనకూతురు జన్మదినం కావడంతో అక్టోబర్ రెండవ తేదీని పండగగా జరపడం మొదలుపెట్టాడు. కూతురికి యువరాణిలా చూసుకునేవాడు.తనపుట్టిన రోజునాడు ఆమె ఏదికోరినా కాదనకుండా ఆమెకు సమకూర్చేవాడు.


                  "ఈ అక్టోబర్ రెండున తనపుట్టినరోజు చెయ్యవద్దు నేను మీరు చేసిన గాంధీజయంతి వేడుకలకు రాను దయచేసి నన్ను ఒంటరిగా నాగదిలో వుండనివ్వండి"అని హీరా ఇందిరాగాంధీ తనతండ్రితో ముందు రోజు సాయింత్రమే ఖరాకండిగా చెప్పింది. అపురూపంగా,అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అలా అనేసరికి హీరా గాంధీ కంగారు పడ్డాడు,అంతేకాదు అతని కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఒంటరిగా గదిలో వదిలి మేము గాంధీజయంతి వేడుకలకు రాలేమని తెగేసి చెప్పేసారు.


            నవ యవ్వన యువతైన తన కూతురు తన పుట్టినరోజు వేడుకులకు దూరంగా వుంటానని అనడానికి వేరే మానసిక వేదనా కారణాలు వుంటాయని అతను అనుకున్నాడు.వెంటనే కూతురు వద్దకు తన భార్యను తీసుకొని వెళ్లి ఏకాంతంగా మాటలాడాడు.తన పుట్టినరోజు వేడుకలకు కూతురు దూరంగా ఉంటానని అనడానికి ఆమె చెప్పిన కారణాలు విని హీరాగాంధీ అవ్వాక్కయ్యాడు.

    

       మీరు వ్యాపారాన్ని నీతినిజాయితీలతో చెయ్యడం లేదు కేవలం లాభాల కోసం అక్రమ వ్యాపారాన్ని చేస్తున్నారు.నాసిరకం బియ్యానికి ఫాలిష్ పెట్టించి దేశవిదేశాలకు ఎగుమతి చేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు, కొవ్వు రాళ్లను బియ్యంలో కలిపి అధిక లాభాలు తీసుకుంటున్నారు కొలతల్లో మోసం, నాణ్యతతో మోసం చివరకు ధాన్యం కొనుగోల్లో రైతుకు మోసం,కూలీలకు వేతనాల్లో కోత ఇలా మీ వ్యాపారం మొత్తం అవినీతి మయం నేను ఇంతవరకూ చిన్న పిల్లను కాబట్టి నేను తెలుసుకోలేకపోయాను.మీరు మహాత్మాగాంధీ పేరు పెట్టుకొని అతని పేరు నిజాయితీ పరులైన మాన పూర్వీకులు పేర్లు చెడగొడుతున్నారని మా స్కూల్లో కొంతమంది పిల్లలు నాతో అన్నారు,పెద్దవాళ్ళు అనుకున్న మాటలనే పిల్లలు చెప్పుకుంటారు కదా పైగా మీరు గాంధీ పేరిట గుడి గోపురాలు కట్టి దానధర్మాలు చేసి పాపం కడిగేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు.నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ మీరు చేసే వేడుకలకు రాను నాపుట్టినరోజు పండుగ జరుపుకోను,నేను మీకున్న ఒకే ఒక్క వారసురాలను నాకు పాపపు సొమ్ము ఆస్తి వద్దు దయచేసి ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అరిచింది


     హీరాగాంధీ అతని భార్య కన్నీరు పెట్టుకున్నారు. ఇకపై అక్రమ వ్యాపారం చెయ్యను చేస్తే నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ఇప్పటికి మా మాటవిను,నేను నా పూర్వేకులు మీద,గాంధీమహాత్ముడు మీద ముఖ్యంగా మాకు పంచప్రాణాలయిన నీమీద ఒట్టు వేసి చెబుతున్న ఇకపై మీ తండ్రి నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉంటాడు అని కూతురు హీరా ఇందిరాగాంధీ పై ప్రమాణము చేసాడు హీరా గాంధీ.తల్లికూడా నచ్చ చెప్పడంతో హీరాఇందిరాగాంధీ


మెత్తబడింది కానీ ఈసారి నన్ను ఒంటరిగా వదిలేయండి వచ్చే సంవత్సరం లోగా నాన్నా గారి వ్యాపార తీరులో మంచి మార్పు కనిపించి ప్రజలచే సెహబాస్ అనిపించుకుంటే నేనే అందరికన్నా ముందుండి గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తాను అని ముక్కుసూటిగా చెప్పేయడంతో హీరాగాంధీ అక్కడనుండి వెళ్లిపోయి, గాంధీ జయంతి వేడుకల్లో వేదికమీద జాతిపిత గాంధీ విగ్రహంపై మౌనంగా ఒట్టు వేసుకొని నా వ్యాపారాల్లో ఇకపై నీతి నిజాయితీలు చూస్తారు మహాత్మా! అని సంబరాలును ముగించి, అప్పటినుండి చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేసుకున్నాడు.






Rate this content
Log in