broken anjel Keerthi

Children Stories Comedy Children


3  

broken anjel Keerthi

Children Stories Comedy Children


బామ్మ వైరల్ అయ్యిందొచ్(బుడుగు)topic6

బామ్మ వైరల్ అయ్యిందొచ్(బుడుగు)topic6

3 mins 202 3 mins 202

బుడుగు పెద్ద వాడు అయిపోతే?

బుద్ధిమంతుడు ల మారిపోతే?


హోరి పిడుగా అని పిలుస్తూ నవ్వించే బామ్మ నేటి తరానికి తగ్గటుగా మారిపోతే?


బుడుగు..ఒరేయ్ నాన్న నిన్నేరా..కాస్త ఇటు రారా ఈ మెట్లు ఎక్కలేకపోతున్న కాస్త వచ్చి ఆ చెయ్యి ఇలా పడేయి..మా సుపుత్రుడు కి చెప్తూనే వున్నా నా గది పైన వద్దురా కిందనే వుండనివ్వు అని వింటేగా...మేమంతా పైన గదిలో వుంటే నువ్వు ఒక్క దానివి కింద ఎందుకు వద్దు రాత్రి పూట ఏదయినా అవసరం పడితే ఎలా అంటూ పై గదిలో పెట్టారు ఎక్క లేక దిగ లేక చస్తున్నాను అంటూ మనవడూ బుజం పై చెయ్యి వేసి మెల్లిగా మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది....

హమ్మయ అంటూ మోకాళ్లు పట్టుకొని నిట్టూరుస్తూ

కాస్త ఆ మంచి నీళ్ళు అందుకోరా బడవ అంటూ వుండగానే 17 ఏళ్ళ బుడుగు మంచినీళ్లు అందిస్తూ మరి ఎందుకే బామ్మ కిందికి మీదికి ఒక్క చోట రామ అంటు కూర్చొ కా...


ఏమిటి రా కూర్చునేది....నువ్వు ఏమో నీ ఫోన్ పట్టుకొని చెవుల్లో ఏవో దుదిపింజలు పెట్టీ (ఇయర్ ఫోన్స్) కూర్చుంటవూ..మీ అమ్మ ఏమో ఫోన్ పట్టుకొని వంటలు చూస్తుంది ..మి నాన్న అయితే ఎదో సూట్ కేస్ లాంటిది పట్టుకొని తిరుగుతాడు..

మరి నాకు ఎలా రా అయ్యేది కాలక్షేపం...మీ జీవితాలు మివి అన్నట్టు మీ లోకం మీదే నాతో తీరిగ్గా కూర్చుని మాట్లాడేది ఎవరు..కబుర్లు చెప్పేది ఎవరు అంటూ మొహం తింపుకుంది.  


అయ్యో బామ్మ ...అల అనకే సరే నేను కాలేజీ కి వెళ్ళి వచ్చిన తరువాత నికు బోలెడు అన్ని కబుర్లు చెప్తాను అప్పటి వరకు నా ఫోన్ వాడుకో...

ఎం చేయాలి రా...దీన్ని...


నికు ఎం ఇష్టం చెప్పు...


నాకు సాహిత్యం అన్నా సంగీతం అన్నా బోలెడు ఇష్టం రా...


సరే అని దింపు మొబైల్ ఎలా వాడాలి చెప్పి కాలేజి కి వెళ్ళిపోయాడు..


లంచ్ టైం ఫ్రెండ్స్ అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు...ఒక ఫ్రెండ్ ఫోన్ చూస్తూ తెగ నవ్వుతున్నాడు ...ఎం అయింది రా అని అడిగే సరికి డింపూ కి ఫోన్ ఇచ్చాడు...


బామ్మ నువ్వు బహుపరాక్...నిన్నటి వరకు ఆమె ఎవరో తెలియదు ఇప్పటికీ ఎవరో తెలియదు కానీ ఆమె అందరినీ మైమరిపిస్తోంది...నవ్విస్తుంది ఇప్పుడు తన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది ...మీ కోసం ఆ వైరల్ వీడియో.. .


అంటూ యాంకర్ తనది అయిన శైలిలో అంటుంది...ఆత్రుత గా చూస్తున్నా బుడుగు ఒక్క సారి గా కంగుతిన్నాడు ...

ఇదిగో ఇలా వాడే బామ్మ అంటూ ఒక్క సారి చూపి చేతిలో పెట్టీ తూర్రుమన్నాడు ఈ అట్ట పెట్ట లో ప్రపంచం వుంది అన్నడు వెధవ అసలు ఎం అర్ధం అయ్యి చావడం లేదు అయ్యో నాకు నేనే కనబడుతున్న ఏమిటి ఇది ఫోనా లేకపోతే అద్ధమా ఏమిటో అంతా...ఇక నాకు కోపం వస్తె నిన్ను ఎలా అయిన నేర్చుకొని నా లాంటి ముసలి వాళ్ళకి క్లాస్ లు ఇస్తా ఎలా వాడాలి అని...సాయంత్రం ఆ బడుద్ధాయు రాగానే త్వరగా నేర్పించేయమని అనాలి వాడిని ... నేర్పిస్తాడ ..!

నేర్పిస్తాడు లే ఎందుకు నేర్పడు...వాడి తొమ్మిదో తరగతి వరకు పక్క తడిపే వాడు అల కాదురా అని వాడికి బుద్ధి చెప్పి అల కాదురా అబ్బాయి అని మన్పిన్చిన దాన్ని నాకు నేర్పక ఎవరికి నేర్పుతాడు?రాగానే అడిగెయ్యలి కానీ ముందు దీన్ని ఎలా ఆపాలి అంటూ అన్ని బటన్లు నొక్కుతూ వీడియో కట్ అయ్యి అయిపోయింది.ఇది ఆ వీడియో..

 

బామ్మ మా బామ్మే అంటూ గబ గబ పరుగు తీశాడు ఇంటికి ...బామ్మ గుర్రు కొడుతూ మధ్యాహ్నం నిద్ర తీస్తుంది...పక్కనే వున్న ఫోన్ తీసి చూసాడు...అన్ చెయ్యగానే నోటిఫికేషన్ల మోత... చుసే సరికి వేళల్లో సబ్స్క్రయిబ్ లు,లక్షల్లో కామెంట్స్, కోట్లలో వ్యూస్...

అమ్మో బామ్మ ఎంత పని చేసావు ..ఒక్క పూట ఫోన్ ఇస్తే అంతా గందరగోళంగా చేసావు కదే నువ్వు పాపులర్ అయ్యావు సరే నా పరువూ ఎందుకు తిసేసవే.,అయిన అసలు కొన్ని వీడియో లు ఎందుకు వైరల్ అవుతాయి అర్ధం కాదు. ఇకనైనా బామ్మ కి కాస్త సమయం ఇవ్వాలి లేదంటే ఈ సారి చెప్పడం కాదు ఏకంగా లైవ్ వీడియో పెడుతుంది..అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు ఏడ్వాలో నవ్వాలో అర్ధం కాక బుడుగు..Rate this content
Log in