Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Others

4.5  

Gayatri Tokachichu

Others

విరి బాలల చిరు నవ్వు

విరి బాలల చిరు నవ్వు

1 min
2.2K


విరి బాలల చిరునవ్వు //


తెలతెల వారంగలేదు

కళకళ లాడుతు పుల్గులు

కిలకిలరావాలు పలికి

యిల జనులను లేపుతుంటే

తొలిపూజకు వేళాయ నంటు

విరు లెన్నో తెచ్చెదనని

పఱుగిడి చేరితి నే

సుమ సౌరభ వన వాటికి.

 మల్లెలు మొల్లలు మంకెన మందార జాజి విరులు, సిగ్గుల చేమంతులు, బంతులు,సింగారపు శంఖు పూలు,

చిరు ప్రాయపుసుమ బాలలు సిరి నవ్వులు కురిపించెను జల జల మని కిల కిల మని.

మురిపెముగా తడిమితి నే

తడిపూవులు ఝల్లు మనగ

ఎర్ర బారి విస్మయముగా నావంకను చూస్తుంటే

అలకేమో!కినుకేమో

భయమొద్దని పలకరించి

చిరునవ్వును నవ్వితి నే

సుమ బాలలు మూతి ముడిచి కనులు తిప్పి

కణ కణ మని కోపంతో

"ఒక్క రోజు తల్లి ఒడిలో

మురిపెముగా ఊగుచుండి ముద్దు లాడి

గారముగా జీవింతుము త్రుళ్ళిపోయి 

మరుదినము మాకీ తనువు లేదు!తల్లి లేదు!

సురలోకము చేరుటకై వెళ్లి పోవు

మమ్ము చూచి జాలి పడవా!

నెమ్మదిగా తరలి పోవా!"

తల వంచితి పరికించితి

మరి మరి ఆ మాటలు నాలో

మది నిండుగతడి నింపగ

మరలితి నే విరి తోటను వీడి పోతూ

వెనుదిరిగి చూచితి నే

కళకళ లాడుచు సుమ బాలలు చిరు నవ్వుతో

తల లూపుచు పరిమళించె. //


Rate this content
Log in