Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Others

4  

Gayatri Tokachichu

Others

వాన వెలిసింది

వాన వెలిసింది

1 min
320



గడ్డివాములు తడిసె

కట్టెపుల్లలు తడిసె

గూడు చెదిరి పోయె

గుడిసె కదిలి పోయె

గంపలో ధాన్యమ్ము తడిసి ముద్దయి పోయె

కొంప కొల్లేరాయె, గుండె బేజారాయె

గంజి నీళ్లు త్రావి కన్నబిడ్డలు సోలె

కట్టు బట్టలు మిగిలె కాసు మిగలక పోయె

నారు మడులే మునగ

నీరు నిలిచి పోయె

కలియ చూడగ పొలమేది?

చెరువు రూపున మారె

అడుగు ముందుకు పోక అన్నదాత కుమిలె

ఆరు గాలపు పంట ఆవిరై పోయె.

పట్టెడన్నము పెట్టె పంట పొలములు నీరై

బురదనిండి పోయి పురుగు పుట్ర చేరె

కాలమింతే యనుచు

కాళ్లీడ్చుకొని వచ్చి కరువు కోరలో చిక్కి

సన్నకారు రైతు బ్రతుకు భయమును దిగమ్రింగి

వాన వెలిసిందనుచు

కాడి పట్టి పొలముకు కదిలి రాగా

వెచ్చ వెచ్చని సూరీడు వెలుగు తెచ్చెను నేడు.

చావు భయము లేని వీర సైరికుండతను

ఆశ కరమున బట్టి అడుగు వేసెను రైతు.


Rate this content
Log in