సోధి
సోధి


సోధి సెబుతానండి సోధి సెబుతాను
కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ
కరుణించవే మమ్ము కనకదుర్గమ్మ
ఉన్నది ఉన్నట్లు మీకెరుక చేస్తాను
ఇనుకోండి నా మాట నా దేశ జనులారా =సోధి =
లాక్డౌన్ తీసాక రోడ్డుమీదకీ రాక
తగ్గిస్తేనే బతుకు బాగుండునేమో
ఇల్లిడిచి మనమొస్తే
మూతికి మూరెడు గుడ్డేమో కట్టాలి /సోధి /
సర్కారీ మాటలు సక్కగా ఇనుకోండి
రోడ్డుపై కుప్పలు కుమ్మరించక సూడు
రోడ్డుపై ఎవరినీ ఉమ్మనీక సూడు
పరిశుభ్రతే మనకు ఆరోగ్యమాయె /సోధి /
ఖాకీలు కార్మికులు రోడ్డు పట్టారాయె
మనల్ని కాపాడే దేవుళ్ళు వారాయె
దవాఖానాలేమో దేవాలయాలయే
పనిసేయు వారేమో దేవుళ్లుగా మారే
మరి వారికి దండాలు పెట్టక పోయే
వారికి కష్టాలు కలిగించ మాకు/సోధి /
ఇక మనమంతా బుద్ధిగా నడవాలి ముందుకు...
దేశ ప్రగతికి ముందడగు వేద్దామ్.. /సోధి /