సమస్యాపూరణము.
సమస్యాపూరణము.
1 min
260
సమస్య.
'భావన చేసిన జనులకు భవములు తొలగున్ '
------------------------
నా పూరణ /
కందము /
**జీవము నిల్పెడి శౌరిని
గావఁగ రమ్మని పిలువగ కరుణను జూపున్
శ్రీవరుడాహరిని సతము
భావన చేసిన జనులకు భవములు తొలగున్ /**
---------------------------