Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Others

4  

Gayatri Tokachichu

Others

సాగుము యువతా!//

సాగుము యువతా!//

1 min
220


సాగుము!యువతా!//

కవిత //

పోటీతత్త్వముతో చెలగాడుచు

ప్రతిభను చూపుచు గెలిచెడి యువతా!/

దీటుగ నిలబడి విశ్వపుటంచున

చాటగ దేశపు కీర్తిని ఘనులై

శాస్త్రములందున లోతగు శోధన

సల్పుచు ముందుకు దూకుచు నూతన

శకముకు నాంది పలుకుచు యువతా!/

భావికి దారులు వేయుచు జయులై 

నీతికి నిత్యము తోడుగనిలిచి

ఘాతుక భావనలన్నియు విడిచి

శాంతియు ధర్మము కోరుచు యువతా!/

దేశ ఋణంబును తీర్చుచు హితులై 

మతకలహంబులు మారణ హోమము

మనకిక వలదని సాత్విక 

జీవన సాధకులై నవ యువతా!/

మంచితనంబుకు తరగని నిధులై 

మట్టిని, మహిళను పల్లెను, తల్లిని

ఎల్లరి మేలును కోరెడి వనముల,

నదులను,గిరులను, పశువుల పక్షుల

రక్షణ చేయుచు భారత యువతా!/

జగతికి జాగృత మొనర్చి సిరులై

భారత దేశపు జవజీవముగా

పరుగులు బెట్టుచు వర్ధిలు యువతా!//


Rate this content
Log in