Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

పక్షి లేని పల్లె

పక్షి లేని పల్లె

1 min
259


పక్షి గూడులు కనరాని పల్లె మిగిలె

చెట్టు చేమలన్ గొట్టగా

జీవమేది?

చుక్కనీరిట కరువాయె సొమ్మసిల్లి 

ఉస్సురంచును పులుగుల ఊపిరాగె.


రేడియేషను పెరుగంగ బీడులాయె 

పిట్టలన్నియు కలతతో బెదిరిపోయి

వలస వెళ్లిన వెచటికో వసుధయందు.

పాలపిట్టలు కనరావు కాలగతిని

కలిసిపోయిన వింతలో కనులుమూసి.

పిచ్చుకల వూసు లేదిల ప్రేమలేదు 

వేడి పుట్టెను ధరణిలో వెతలుపెరిగె.


పక్షి సంతతి తగ్గగా ప్రాణి కోటి

తరిగి తరిగిటు కూలెను దైన్యమొంది

నేడు పక్షుల గతివోలె నిలువలేక

 మనిషి సంతతి భస్మమౌ మనికిలేక 

కళ్ళుతెరచి చూడుమా!కలుషితమును.


పశుల పక్షుల కాపాడి ప్రాణమిచ్చి

చెట్టు చేమలన్ వనముల వసుధ యందు

పెంచి నప్పుడు జగతికి మంచి జరుగు.

జీవ కోటికి భారమౌ చేష్ట లన్ని

మాని వేసిన చాలును మనిషి మిగులు./


Rate this content
Log in