Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Others

4  

Gayatri Tokachichu

Others

జై జగన్నాధా!

జై జగన్నాధా!

1 min
235


---------------------------

జై జగన్నాధా!


జయము జయమంచు పలుకగ జగతి నేడు

భక్త వరులను బ్రోవగా పఱుగులిడుచు 

రథము నందున సాగెను రాజసముగ

జగము లేలెడి నాథుడు నిగమనుతుడు.


తోడ బుట్టిన వారితో కూడి వచ్చి 

పిన్ని గారిల్లు చేరెను ప్రేమ మీర 

నమ్మి కొల్చిన దరిచేరి నడచు వాడు

నీల మోహన కృష్ణుడు నీడవోలె.


పర్వదినమంచు భక్తులు పరవశించి

మ్రొక్కుకొంచును దేవర మ్రోల పడుచు

నుత్సవంబులు చేసిరి యుఱికి దూకి

సంబరంబుగ గడిపిరి సమధికముగ.


పరమ పావనుడైనట్టి వరదుడితని

తలుచుకొన్నను చాలును దగ్ధ మగును

పాపరాశియు, జన్మాంత తాప మిచట

మరల పుట్టుక లేనట్టి వరము దొరుకు.


కులము గోత్రము కాపాడు కూర్మి తోడ

వంశమంతయు వర్ధిల్లు వాసిగాను

పిలిచి వేడిన వెంటనే చెలిమి చేసి

కరము నందించి తిరుగును కరివిభుండు.//

-------------------------


Rate this content
Log in