STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

4  

Midhun babu

Children Stories Fantasy Children

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

1 min
3


వెలలేని మమతను మనసుతో చూస్తున్న,

గొంతును తడిపే అమృతంలో

అమ్మతనమే వీక్షిస్తున్న.


నాలోని నీఊహే కలలోనూ

వీడదని చెబుతున్న,

ఒంటరితనం వదిలేసి అమ్మప్రేమను మదిలో దాచుకుంటున్న.


అనుబంధమే ఆకలితీర్చు

పరమాన్నంగా భావిస్తున్న,

సృష్టి కి ప్రాణాధారం

అమ్మప్రేమేనని తెలుసుకుంటున్న,

ఓరిమితో నిండిన అమ్మే

అనురాగమై నడిపిస్తుందని అంటున్న,

ఈ తలపుల వాకిటినే

హృదిలో పదిలం చేసుకుంటున్నా.


వెలతికాని అమ్మ ఆత్మీయతే

ప్రతి జన్మ కోరుకుంటున్నా,

అమ్మఒడిని మించిన స్వర్గం

వేరే లేదంటున్నా,

అమ్మ ఆలంబనకు ఆది అంతం

వున్నదా అని అడుగుతున్నా,

అమ్మ హృదయానందపు

నవ్వుల వెలుగై వుండడమే

సత్య భాగ్యమంటున్నా.

నే ఆరాధించు అమ్మ కౌగిలే

హృదయాకలి తీర్చునంటున్నా.


మనసును చదవడం

అమ్మలోనే నే నేర్చుకుంటున్నా,

మనసైన మమకారపు

అమ్మ గుండెనే నా గుండెగా మార్చుకుంటున్నా,

అనుభవాల

మధురానుభూతుల కాలాన్ని

మదిలో పదిలపర్చుకుంటున్నా,

అమ్మలేని నేను

మరోజీవి అమ్మలో మా అమ్మను చూస్తున్నా,

హృదయాన కదలాడు అమ్మకు నిత్యం పాదాభిషేకం చేస్తున్న.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్