STORYMIRROR

RAMYA UPPULURI

Others

4  

RAMYA UPPULURI

Others

పెండ్లి పిలుపు

పెండ్లి పిలుపు

1 min
375

  అందరూ పెళ్ళికి పట్టు బట్టలు సిద్ధం చేసుకున్నారా అండి !! పెండ్లి కూతురు పెండ్లి కొడుకు కి బహుమతి కొన్నారా!! ఎవరి పెళ్ళి అనుకుంటున్నారా !! ఇంకెవరిది

జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా....హా...గుర్తు వచ్చింది కదా !!

    శ్రీరామనవమి నాడు అంగరంగ వైభవంగా మన సీతారాములు పెళ్ళి చేసుకోబోతున్నారు.

సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం.అంటే మన అందరికి పెళ్ళి పిలుపు వచ్చినట్టే !! కానీ మనము అంతా మిథిలా నగరానికి వెళ్ళలేము కదా!!

   అందుకే మన ఇళ్ళల్లో పట్టు బట్టలు కట్టుకొని సీతారాములని పూజించుకుందాము. మన టీవీ లో ప్రసారమయ్యే సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షిద్దాము. కమ్మటి వడపప్పు పానకం తో విందు భోజనం చేద్దాము.

      పెళ్ళి కి చక్కగా హాజరు అయినట్టేగా !!

ఒక్క నిముషం, వధూవరు ల కి బహుమతి ఇచ్చామా !! అది కూడా ఇచ్చేస్తే సరి.

    శ్రీమద్రామాయణాన్ని, మీ సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శంగా తీసుకుని ధర్మం వైపు నడుస్తాము అని మనఃస్ఫూర్తిగా వారికి మాట ఇద్దాము.

    మన భక్తే ఆ సీతారాముల కి మనము ఇచ్చే బహుమతి.

                       జై శ్రీరామ్

    శ్రీ సీతారామచంద్రస్వామి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు !!

                  సర్వేజనా సుఖినోభవంతు !!

                         ధర్మో రక్షతి రక్షితః



Rate this content
Log in