Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Children Stories Comedy

4  

Dinakar Reddy

Children Stories Comedy

సీ గాన పెసూనాంబా

సీ గాన పెసూనాంబా

1 min
193


హారి పిడుగా! నువ్వు బాబాయ్ ఫోన్ తీసుకుని ఏం చేస్తున్నావ్ రా అంటూ బామ్మ కేక వేసింది.


మరేం. నేనూ బాబాయ్ ఫోన్ ఎందుకు తీసుకున్నానో బామ్మకు చెప్పేద్దూ. నేను చెప్పను. అయినా పిల్ల వాళ్ళు చేసేవి అన్నీ బామ్మలకి చెప్పకూడదు అట.


మా బాబాయ్ చెప్పాడు. మొన్న నేను అరుగు దగ్గర కూచుని అమ్మ చేసిన గారెలు తింటుంటే ఒక రెండు 

జళ్ళ సీత వచ్చింది.


పక్కన బాబాయ్ లేడు కానీ అలవాటు కొద్దీ విజిల్ వేశాను. 


ఆ రెండు జళ్ళ సీత పక్కనే సీ గాన పెసూనాంబ కూడా ఉంది. నేను విజిల్ వేయడం చూసి పకపకా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.


అందుకే నేను సీ గాన పెసూనాంబ వాళ్ళ అమ్మ గారి ఫోన్ నంబర్ కి మెసేజ్ పెడతాను.


చూద్దాం. 


ఒరేయ్ బుడుగూ! నా ఫోన్ నుండి ఎవరికి మెసేజ్ పెట్టావ్. బాబాయ్ షేవింగ్ చేసుకొని వచ్చి కేకలు వేస్తున్నాడు.


అయినా ఈ పెద్ద వాళ్లందరికీ కేకలు వేయడం అలవాటు కాబోలు.


నేనెవరో ఇంకా తెలియలేదా మీకు. అయితే మా అమ్మా నాన్నలను అడగండి.


నా దగ్గర అసలే టైమ్ లేదు.


Rate this content
Log in