STORYMIRROR

Keerthi purnima

Children Stories Comedy

3  

Keerthi purnima

Children Stories Comedy

పరమానంద శిష్యులు topic 2

పరమానంద శిష్యులు topic 2

1 min
227

పరమానందయ్య ఒక రోజు చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు.ఆకాశం లో ఎగిరే పక్షులని చూస్తూ వాటిలా ఎగరగళిగితే హాయిగా ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళే వాడిని అని...


అప్పుడే వచ్చిన శిష్యులు అందరూ వచ్చి ఆయన ముందు కూర్చున్నారు.గురువు గారిని చూస్తూ...


ఒక శిష్యుడు మరో వాడితో .ఒరేయ్ ఆర్తి...

చెప్పరా ప్రాప్తి...అన్నాడు మరో వాడు...


గురువు గారు ఆకాశం లో ఎం చూస్తున్నారు కావచ్చు రా..


వర్షం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు కావచ్చు రా.


కాదు రా చీకటి ఎప్పుడు అవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నారు కావచ్చు. 


కాదురా వర్షం కోసం...


కాదురా చీకటి కోసం....


ఇద్దరు గొడవ పడటం మొదలు పెట్టారు.కాదంటే కాదు అంటూ..


గురువు గారు వాళ్ళ వంక చూస్తూ.ఏమిటిరా ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు.

జరిగింది చెప్పారు శిష్యులు...


పరమానందయ్య వాళ్ళ వంక చూస్తూ.


సరే నేను వర్షం కోసం ఎందుకు చూసాను..అని అడిగాడు 


అప్పుడు ఆర్తి...వర్షం పడి చెట్లు పెరిగితే పండ్లు కోసుకొని తినడానికి...


తన సమాధానం విని కోపంగా చూస్తు...


ఒరేయ్ ప్రాప్తి నువ్వు చెప్పు...చీకటి ఎప్పుడు అవుతుంది అని నేను ఎందుకు చూసాను...


అమ్మగారు పెట్టే వేడి వేడి ఫలహారం కావాలంటే చీకటి పడాలి కదా గురువు గారు...అందుకే అంటూ తన బొజ్జ నీ నిమురుతూ అంటాడు ప్రాప్తి.


మీకు పలహరాల మిద వున్న జ్ఞానం వేరే దేని మీద వుండదా రా...అని వారి మీద అరుస్తూ.దశాబ్దాల కాలం నుంచి మీ తెలివి ఇంతెనార అప్పుడు మిమ్మల్ని మీరు లెక్క పెట్టక అందరి ముందు పరువూ తీశారు.ఇప్పుడు ఆకాశం లో ఎగిరే పక్షులని చూస్తున్న నన్ను తిండిబోతు నీ చేశారు..ఇకనైనా కాస్త మారండర్ర.నా పరువూ తియ్యక అని అంటూ.బొజ్జ నిమురుతూ రండి ఫలహారం స్వీకరిద్ధం అని అంటూ పిలిచాడు శిష్యులను.


పరమానందయ్య శిష్యులు స్కూల్ లో స్నేహితులతో కలిసి విన్న ఆ పాఠం తెలుగువారు ఎవరు మరిచిపోలేరు.ఎన్ని దశాబ్దాలు అయినా మనం ఇంకా గుర్తు పెట్టుకున్నాం అంటే అది ఎంత అద్భుత గాథ కదా!



Rate this content
Log in