వింతల్లరి
వింతల్లరి
1 min
4
అదేపనిగా వింతల్లరి..పెడుతూనే ఉంటావా..!
కన్నులింట నాట్యమలా..చేస్తూనే ఉంటావా..!
జ్ఞాపకాల కేమితెలుసు..సుడిగాలిగ మారేనా..
మనసుగుట్టు పట్టకుండ..గిడుతూనే ఉంటావా..!
అసలులేని ముత్యాలను..ఏరేందుకు ప్రయాసేల..
చెలి చుట్టూ గిరికీలను..కొడుతూనే ఉంటావా..!
జీవితమో అందమైన..ప్రహసనమే చూడవేల..
పెనుఆశల పల్లకీని..మోస్తూనే ఉంటావా..!
నీకు నీవె శత్రువైన..నేస్తమైన తెలిసేవా..
ఇంకా ఏదో కత్తిని..కడుతూనే ఉంటావా..!
మందులతో మాకులతో..నయంకాదు ప్రేమపిచ్చి..
దేనికొరకొ ఎవరివెనకొ..పడుతూనే ఉంటావా..!