STORYMIRROR

Gayatri Tokachichu

Others

4  

Gayatri Tokachichu

Others

శ్రీరాముని కళ్యాణము //

శ్రీరాముని కళ్యాణము //

1 min
228

ప్రక్రియ : పద్య కవిత //


కందము //

శ్రీరామ నవమి దినమున

మా రాముని దివ్య చరిత మక్కువ మీరన్

సారెకు దల్చగ ముదముగ

కోరికలే దీర్చును గద కూరిమి తోడన్//


చంపక మాల //              జయ జయ నాదముల్ చెలగ చక్కని రాముడు దివ్య శోభతో 

హొయలొలి కించు సీత గని యుద్భట మైచెలు వొంది వీరతన్ 

రయమున విల్లు ద్రుంచె నట రక్కసు లందరి గుండె ఝల్లనన్ 

భయమును వీడి దేవతలు పాడుచు నాడిరి సంత సమ్ముగన్//


చంపక మాల//

చిరుచిరు హాసముల్ చిలికి సిగ్గులు చిందుచు వచ్చి నెమ్మదిన్

ధరణిజ పుష్ప మాల గొని తారక రాముని జేరె పొంగుచున్

మురియుచు మౌని ముఖ్యులట పుణ్యదినంబని సంతసింపగన్ 

సురలది గాంచి

మోదముగ సొక్కుచు జల్లిరి దివ్య పుష్పముల్ //


ఉత్పల మాల //

ఆడిరి ప్రేమగా మురిసి యప్సర లెల్ల శుభంబు గోరుచున్

వేడుక నొందుచున్ గలిసి వియ్యము నొందిరి రాజ దంపతుల్

వాడల పల్లె లందునను వైభవ మెంతయొ నుల్ల సిల్లగన్

బాడుచు లోకులెల్లరును భక్తిగ మ్రొక్కిరి రామ చంద్రునిన్ //



కందము //                             మంగళ మౌకద రాముని

సంగతులన్నియు దలంచ సద్గతి కల్గున్

బొంగుచు నీ కథ వినగా

చెంగట జేర్చును నిజమిదె చింతలు దీర్పున్ //




Rate this content
Log in