మృదువో
మృదువో
1 min
2
నీవే నేననుకున్న వేళ...
నీ మాటొకటి తూటాలా
గుండెకు తాకితే మూగబోయా!!
మాటలు రాక కృంగిపోయా!!
వేదనలోన కుమిలిపోయా!!
గుండె వసంతాన్ని రాల్చేసిన శిశిరంలా...
నీరెండిపోయి బీడైన పగుళ్ల నేలల్లే కూలిపోయా!!
బ్రతుకులో తీపేదో వికటించిన విషమల్లె
బతకాలన్న ఆశల్ని చంపే వేళ...
నీనవ్వు నా బ్రతుకును
విరబూసిన పువ్వల్లె మార్చింది!!
నీ కరస్పర్శ ఈ జన్మలో
పునర్జన్మలా తోచింది!!
నీ క్షమాపణ మనసు భారాన్ని
తీసేసిన మారుతమల్లే మరిపించింది!!
ఎంతైనా...నీ మాటేంత కరుకైనా
మనసెంత మృదువో..!!
బంధంలో మాధుర్యమంటే ఇదే కదా!!