STORYMIRROR

Phanikiran AK

Others

4  

Phanikiran AK

Others

కవిత్వం

కవిత్వం

1 min
290

భావాల పులకరింత ......


కవిత్వం


భావోద్వేగాల పలకరింత....


కవిత్వం


కలల లోకపు విహారం ...


కవిత్వం


ఆశల అన్వేషణ.....


కవిత్వం


జనం మనం అనేలా చేసే భావమే....


కవిత్వం


భాష ఏదైనా భావం పలికే పద బంధాల


అల్లికే... కవిత్వం


సమాజ శ్రేయస్సుకు వదిలే అక్షరాల


ఆయుధమే ...కవిత్వం .


అలుపెరగని బాటసారి

చిరు పదాలలో మది మాట తెలిపే పొదుపరి

ఆలకించిన వారిని ఆలోచింప చేసే చాతురి

కాలమెంత మారినా మనసులను కట్టిపడేసే గడసరి..

సాహిత్య సుమ తోటలో విరిసిన సుకుమారి

ఎన్ని ప్రక్రియలు ఉన్నా తన వైపే ఆకర్షించే సరసరి

నాటిన ప్రతిచోటా మొలకెత్తే తరీ

ఎన్నటికీ తరగని సిరి

కవిత్వమనే ఈ పసిడి పదముల గిరి.


***********%%%%%%************


ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు.



Rate this content
Log in