ranganadh sudarshanam

Children Stories

4.2  

ranganadh sudarshanam

Children Stories

సారి చెప్పిన ...డాడీ

సారి చెప్పిన ...డాడీ

5 mins
691


కిరణ్, రవి ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవాళ్ళు.

ఇద్దరికీ చెరొక బాబు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు.


కిరణ్ బాబు పేరు ఆర్య,రవి బాబు పేరు దినకర్.


ఆరోజు ఆదివారం ఎప్పటిలాగే వాకింగ్ కు

బయలు దేరారు,రవి, కిరణ్. 


ఆర్య "డాడీ నేను వస్తాను అన్నాడు". సరే రారా అన్నాడు కిరణ్.


దినకర్ రవి తో "డాడీ నేను వస్తాను అన్నాడు". నోరుమూసుకొని వెళ్లి చదువుకో , వాడికి వాళ్ళు నానా గారాబం ఎక్కువై కొట్టుకుఉంటున్నాడు, ముందు ముందు వాడికి, వాళ్ళ డాడీ కి ఇద్దరికి తెలిసొస్తుంది అంటూ గదిమాడు , దినకర్ కళ్ళవెంట కారుతున్న నీటిని తూడ్చుకుంటు, కాళ్ళను నే లకు బలంగా కొట్టుకుంటూ యింట్లో కి వెళ్ళాడు.


రవి కి కిరణ్ వ్యవహారం పూర్తిగా తెలుసు కనుక ఎo పట్టుంచుకోనట్లు వూరుకున్నాడు.


ఆర్య ఇంటికి రాగానే, ,"డాడీ అంకుల్ అలా ఎందుకు వూరికే మనలను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతారు,నాకు కోపం వస్తుంది అన్నాడు." 


కిరణ్ మాత్రం కూల్ గా, "ఆర్య నీకు నచ్చిన మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు, అంకుల్ ఏదో అంటే పౌరుషం ఎందుకురా, నువ్వు చేసే పని కరెక్ట్ అయితే ఎవరేమన్నా పట్టించకోకు, పట్టించుకున్నావంటే, నువ్వు కరెక్ట్ కాదనేగా అర్థం" గుడ్ బాయ్ వెళ్ళు అన్నాడు. 


ఆర్యా ఏమో డాడీ నువ్వెప్పుడు ఇంతే అంటూ బంగ మూతి పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు.


సుధ కూడా అవునండి "రవి చాలా టూ మచ్ గా మాట్లాడటం నేను విన్నాను, మీరు ఏమి అనరు, నన్ను ఏం అనొద్దంటారు,రవి దీనిని ఆలుసుగా తీసుకొని నోటికి ఎంతోస్తే అంత అంటున్నాడు" అంది.


చూడు సుధ మాటలు అనడం చాలా తేలిక, స్నేహమైన బంధమైన నిలవాలంటే,ఎదుటి వారిని క్షమించే ఓర్పు కూడా వుండాలి. వాడన్నాడని, నేను అంటే ఏమౌతుంది, స్నేహం ముక్కలౌతుంది, భార్య భర్తలమైన మనము అంతే ఒకరినొకరు అర్థం చేరుకోవడం అంటే, ఒకరినొకరు క్షమించు కోవడమే, అది లేనినాడు బంధాలు కూడా బద్దాలౌతాయి. బేసిక్ గా రవి చాలా మంచివాడు, మనిషన్నాకా కొన్ని బలహీనతలు ఉంటాయి వాటిని పక్కన పెట్టి చూస్తే ఆ వ్యక్తి మంచితనం అర్థం అవుతుంది. అన్నాడు.

సుధ కోపం తగ్గ కున్నా కొంత కన్విన్స్ అయి అక్కడినుండి వెళ్ళి పొయింది.


ప్రతిరోజూ దినకర్ స్కూల్ కు వెళ్ళేటప్పుడు రవి వాళ్ళ ఇల్లు హడావిడిగా ఉంటుంది. రవి ,దినకర్ బూట్లు పాలిష్ చేస్తూవుంటే, ఆయన శ్రీమతి రేఖ బ్యాగ్ లో బుక్స్ సర్దుతూ, టిఫిన్ బాక్స్ పెట్టడం, వగైరాలు చేస్తూ ఉంటుంది.స్కూల్ బస్సు రాగానే , దినకర్ బ్యాగ్ పట్టుకొని వెళ్లి వాడిని బస్ ఎక్కించి మరీ వస్తుంది.


ఇక కిరణ్ వాళ్ళ ఇంట్లో ఆర్య తన పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు,అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని, బ్యాగ్ మోసుకుంటూ వెళ్లి బస్ ఎక్కుతాడు.


కిరణ్ శ్రీమతి సుధ కు ఈ వ్యవహారం నచ్చక విషయాన్ని చాలాసార్లు భర్తకు నచ్చ చెప్పాలని చూసింది. రేఖ ఎలా చేస్తుందో ప్రత్యక్షంగా చూపించింది కూడా.


కానీ కిరణ్, సుధ కు ఇలా ఒక స్టోరీ చెప్పాడు


" రూపాంతరం చెందిన ఒక సీతా కొక చిలుక గూడు ఛేదించుకొని బై టికి రావడానికి ప్రయత్నిస్తుంది, దాని రెక్కాలు అందులో ఇరుక్కొని బైటికి రావడానికి ఇబ్బంది పడుతూ ప్రయత్నిస్తూ ఉంది. అది చూసిన ఒక వ్యక్తి దానికి సహాయం చేసి దానిని బైటికి తీశాడు, కానీ అది బై టికి వచ్చాక ఎగరలేక ఇబ్బంది పడుతుంది.దీనికి కాణము, ఆ వ్యక్తి చేసిన సహాయం, అతడు సహాయం చేసి ఉండకపోతే తను బైటికి వచ్చే ప్రయత్నంలో అది మరంతగా తన రెక్కలను బలోపేతం చేసుకొనేది, అప్పుడు బైటికి రాగానే మిగతా అన్ని టిలా ఎగరగలిగేది, కానీ ఆ వ్యక్తి సహాయం దానికి మరణ శాశనం రాసింది" అన్నాడు.


అలాగే మనం కూడా పిల్లల ను స్వయం శక్తితో స్వేచ్ఛ గా ఎదిగేలా చెయ్యాలి తప్ప, ఒకరిమీద ఆధారపడేలా చెయ్యకూడదు.మన ప్రేమ వాడి ఎదుగుదలకు ప్రతిబంధకం కాకూడదు అన్నాడు.

"ఏమో లెండి ఎప్పుడు నామాట విన్నారు కనుక" అంటూ నిట్టూర్పు విడిచింది సుధ.


ఆరోజు స్కూల్ నుండి రాగానే ఆర్య బైట ఫైర్ సిబ్బంది చేస్తున్న డెమో చూస్తూ నిలబడి పోయాడు, అభినవ్ కూడా నిలబడ్డాడు, కానీ వాళ్ళమ్మ " దిన్ను నానా లోనికి వచ్చేయి , డాడీ చూస్తే కోపం చేస్తారు" అని రేఖ అనగానే చిరాకు పడుతూ లోనకు వెళ్ళాడు.


ఆర్యా మెల్లమెల్లగా సైక్లింగ్ నేర్చుకున్నాడు, దినకర్ కూడా ఒకరోజు నేర్చుకుంటూ కింద పడగానే, రవి వాణ్ణి గట్టిగా మందలించి సైకిల్ గుంజుకొని లాక్ చేసి, పక్కన పెట్టాడు. వాడి కి చాలా కోపం వచ్చింది కాని ఏమి అనలేక ఏడచుకుంటు ఇంట్లోకి వెళ్లి పోయాడు.


ఒకరోజు రవి, కిరణ్ లు ఇద్దరు వాకింగ్ కు వెళ్ళారు, రేఖ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి, భయపడిన రేఖ, దినకర్లు అరుస్తూ, వణికి పోతు బైటికి పరుగెత్తారు. అది చూసిన ఆర్యా వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి, ఇంట్లో ఉన్న చిన్న ఫైర్ ఎక్స్టెంగిషర్ తో కిచెన్ లో వ్యాపించిన మంటల పై స్ప్రే చేసాడు , ఈలోగా ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాద o తప్పింది. సమయానుకూలంగా స్పందించిన ఆర్యా ను అంతా మెచ్చుకున్నారు. 


ఈలోగా హడావిడి గా వచ్చిన రవి , నాకు ఫోన్ చేసే బదులు ఆమాత్రం ఫైర్ స్టేషన్ కు ఎందు కు ఫోన్ చెయ్యలేదు, అయిన జాగ్రత్తగా ఉందొద్దా, ఇంట్లో అంతా సోం బేరులయ్యారు, అంటూ పెద్ద పెద్దగా కేకలు వేశాడు. కానీ ఇంట్లో వాళ్లకు ఫైర్ నెంబర్ తెలుసా లేదా? అని ఆలోచించ లేదు, పైగా హడావిడిగా తాను వచ్చాడు గాని, తను కూడా ఫైర్ సర్వీస్ కు ఫోన్ చేయలేదు.


ఆర్యా, కిరణ్ ఇద్దరు,హాస్టల్లో ఉంటూ, I.I.T, ఎంసెట్ కు ప్రేపరే అవుతున్నారు.


కిరణ్ ఎప్పటిలాగే ఆర్యా పైన ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా బాగా చదివితే వచ్చే ఉపయోగాలు వివరించి, గతంలో న్యూస్ పేపర్ లో వచ్చిన బెస్ట్ 

ర్యాంకర్ల మనోగతాలను చదవమని ఇచ్చేవాడు. ఇవి వాడిలో మరింత ఆసక్తిని పెంచేవి, తాను వారిలా ర్యాంక్ సంపాదించాలని పట్టుదలగా ఇష్టంగా చదివే వాడు.


రవి మాత్రం ఎలాగైనా దినకర్ ను ఐఐటీ సీటు కొట్టి తీరాలని, లేదా దేనికి పనికి రాకుండా పోతానని హెచ్చరిస్తూ వుండేవాడు. ఇది వాడి పైన తెలియకుండా నే వత్తిడిని పెంచేది.


ఎప్పటి లాగే I I T క్లాస్ ముగియగానే పిల్లలందారి తో పాటు ఆర్య, దినకర్ ఇద్దరు హాస్టల్ కు వెళ్లి మూడవ ఫ్లోర్ లోని తమ గదిలో పడుకున్నారు. 


అర్థరాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్టల్ లో మంటలు వ్యాపించాయి.పిల్లలంతా పరుగులు తీస్తున్నారు. ఆర్య వెంటనే తన బేడీషీట్ తో పాటు మిగతా నాలుగైదు బెడ్ షీట్ల ను తీసుకొని జాయింట్ నాట్ వేసి ,దానిని పిల్లరుకు ముడి వేసి, గ్లాస్ విండో ను పగులగొట్టి దాని గుండా బెడ్ షీట్ సహాయంతో క్రిందకు దూకాడు.చిన్న చిన్న దెబ్బలతో ప్రమాదం నుండి బైట పడ్డాడు. దినకర్ కాస్త కంగారు పడి అటు ఇటు పురుగులు తీసి చివరకు మెట్లగుండా పరుగు తీసాడు కానీ పిల్లల తొక్కిసలాటలో పడిపోయాడు ,బలంగా దెబ్బలు తగిలాయి. మొత్తానికి ప్రాణాలతో బైటపడి హాస్పిటల్ల్లో అడ్మిట్ అయ్యాడు.


దినకర్ కు వాడికి తగిలిన దెబ్బలకంటే ,ఐఐటీ ఎగ్జామ్ తన కొడుకు ఎలా రాస్తాడో ...... ఇప్పుడెలా... అంటూ వాళ్ళ నాన్న మాట్లాడే మాటలు వాణ్ణి ఎక్కువగా బాదించేవి, అలాగే నువ్వెందుకు ఆర్యల దూకాలేద నే దెప్పి పొదుపు మాటలు మరింతగా క్రుంగతీసేవి. వాళ్ళ నాన్న ను చూస్తేనే వాడికి భయం వేసేది.


ఒకరోజు తల్లితో దినకర్ ఇలా అన్నాడు "అమ్మా డాడీ కి నాకంటే నా చదువే ముఖ్యమా అమ్మ?ఎందుకమ్మా డాడి ఎప్పుడు ఇంకొకరితో పోల్చి నన్ను తిడుతూ ఉంటారు. డాడీ కి నేనంటే ఇష్టం లేదా అమ్మ? 

ఒకవేళ నాకు ర్యాంక్ రాకుంటే డాడీ ఏంచేస్తారమ్మ ,నాకు చాల భయం వేస్తుందమ్మా, చచ్చి పోవాలనిపిస్తుందమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు.


రేఖ కూడా దినకర్ ను గట్టిగా పట్టుకొని ఓదార్చుతూ ఏడ్చింది.


ఇదంతా పక్కనే ఉండి విన్న రవి చలించి పోయాడు,కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి.నా ప్రవర్తన ఇంతా నీచంగా ఉందా ...., ఎంతోమంది పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడానికి వత్తిడే కారణం అని తెలిసి కూడా,....... అన్ని తెలిసిన నేను ఇలా ప్రవర్తించాన , అని పశ్చాత్తాప పడ్డాడు.


ఒక్క ఉదుటున వెళ్లి దినకర్ ను గట్టిగా పట్టుకొని ఉప్పొంగుతున్న దుఃఖా న్నీ ఆపుకుంటు, "సారి నానా నిన్ను చాలా హర్ట్ చేశాను,నీకన్నా, నీ చదువే ముఖ్యమని అనుకున్నాను, కానీ నీకన్నా ఏది ముఖ్యం కాదు నానా. ఈ నాన్నను క్షమించు కన్నా," అన్నాడు. రేఖ నువ్వు కూడా నన్ను క్షమించు, అంటూ కాన్నీరు మున్నీరయ్యాడు.


ఇకముందెప్పుడు ఇలా మాట్లాడను,నిన్ను బలవంత పెట్టాను, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అంటూ రవి దినకర్ ను దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని తల నిమిరాడు.


దినకర్ డాడీ అంటూ తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు.


రవి తాను ఓడిపోయినా.. తనవాళ్ళ మనసును గెలు చుకున్నాడు..బలవతoగా....ఒక కాయను తెంచగలం కానీ ఒక పువ్వును పూయించలేము.

మనిషి వికాసం ఎదుగుదల...పువ్వులా సున్నితమైనవే కదా...

ఈ నిజం తెలుసుకొని....

పిల్లలను స్వేచ్ఛ గా ఎదగనిద్దాం!

స్వతంత్రంగా ఆలోచించేలా పెంచుదాం!!

..........సమాప్తం........





Rate this content
Log in