STORYMIRROR

Keerthi purnima

Children Stories Classics Inspirational

3  

Keerthi purnima

Children Stories Classics Inspirational

ఉపకారం - అపకారం topic 9

ఉపకారం - అపకారం topic 9

2 mins
261

అనగనగ ఒక ఊరిలో రాము అనే ఒక చిన్న వ్యాపారి వుండే వాడు.తన వ్యాపారం లో నష్టాలు రావడం చేత తను ఎప్పుడు చాలా బాధ పడుతూ వుండేవాడు.ఒక రోజు తన ఇంటి ముందు ఒక బాతు వచ్చి ఆగింది...అదే వెళ్ళిపోతుంది అని రాము వదిలేస్తాడు.కానీ ఆ బాతు వెళ్లకుండా అలానే వుంటుంది.రాత్రి పూట చలిలో కూడా అక్కడే వుంటుంది. రాము ఆ బాతు అల చలిలో అక్కడే వుండడం చూసి తననీ ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు.

తెల్లవారి చూడగానే ఆ బాతు గుడ్డు పెట్టింది.అది బంగారు గుడ్డు..ఆశ్చర్య పోయిన రాము తన బార్య కి చూపించాడు...తన బార్య కూడా ఆశ్చర్య పోయి ...చాలా ఆనంద పడుతుంది.అల అది పెట్టిన బంగారు గుడ్డు నీ బంగారు వ్యాపారికి అమ్మి వచ్చిన డబ్బు తో ఆనందం గా జీవిస్తారు...


కానీ ఒక రోజు రాము కి అత్యాశ కలిగింది...ఇలా ఎన్ని రోజులు..ఒకే సారి ధనవంతుడి ల మారిపోతే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తాడు రాము. ఆ విషయం బార్య తో చెప్తాడు.మనకి అన్నం పెట్టే అన్నపూర్ణ అది వద్దు అల చెయ్యకండి అని అంటుంది..తన ముందు సరే అన్న రాము తను పడుకోగానే వెళ్లి దాని పొట్ట కోసి చూస్తాడు...అందులో ఎం లేదు...ఎంతగానో పశ్చాత్తాప పడతాడు రాము.తెలివి తక్కువ పని చేసి ఎంత పెద్ద తప్పు చేసానో అని బాధపడతాడు..బార్య మాట విని ఉండవలసింది అని అనుకుంటాడు.కొన్ని రోజుల కి తను కూడా బెట్టిన డబ్బు మొత్తం అయిపోతుంది.తను కూలి పనులకి వెళ్ళ వలసి వస్తుంది.దానితో చాలా బాధ పడేవాడు .ఒక రోజు అరుగు మీద కూర్చుని తను చేసిన తప్పు గుర్తు చేసుకొని బాధ పడుతన్నా రాము నీ చూసి ..తన బార్య తన వద్దకు వచ్చింది...

ఎం అయింది అని అడిగింది...


నాకు ఉపకారం చేసిన బాతు కి నేను అపకారం చేశాను..నా స్థితి ముందు కంటే ఇంకా ఎక్క్కువ దిగజారింది ..నేను చేసిన తప్పు కి నిజం గా నేను చాలా బాధ పడుతున్నా.


మీరు మీ తప్పు నీ తెలుసుకొని మంచి పని చేశారు.. మీలో ఇలాంటి మార్పు రావాలి అనే నేను బాతు నీ దాచిపెట్ట...క్షమించండి... ఆ రోజు మీరు చంపింది మామూలు బాతు నీ..బంగారు బాతు నీ కాదు... ఆ బాతు ఆ రోజు నుంచి పెట్టిన బంగారు గుడ్లన్ని దాచి పెట్టను....అని చెప్పింది..


రాము చాలా సంతోషించాడు ...తను తన తప్పు తెలుసుకుని మంచి వ్యక్తి గా మారిపోయాడు....అత్యాశ నీ వదిలి...పేదవారికి సహాయం చెయ్యడం మొదలు పెట్టాడు....


ఒక వేళ!నిజమయిన బంగారు బాతు చనిపొక పోతే ఎలా ఉండేది అని ఊహించి రాసాను...తప్పుగా అనుకోకండి 🙏


Rate this content
Log in