శ్రీనివాసరాజు కథా రచయిత

Children Stories Others Children

4.5  

శ్రీనివాసరాజు కథా రచయిత

Children Stories Others Children

శ్రమజీవే అల్లుడు

శ్రమజీవే అల్లుడు

2 mins
350



    రామయ్య వ్యవసాయదారుడు. ఎప్పుడూ శ్రమను నమ్ముకొని నిరంతరాయంగా వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను గడించాడు. రామయ్యకు ఇద్దరు కొడుకులు, కవల పిల్లలు. పెద్దవాడు చంద్రానికి చదువు అంతగా అబ్బలేదు. పైగా సోమరిపోతు. తల్లిదండ్రులకు ఏ సాయం చేయడు. కడుపు నిండా తినడం, తిరగడం ఇవే అతని దినచర్య. తండ్రి కష్టపడక పోతే భవిష్యత్తులో చాలా నష్టపోతావని పరి పరి విధాలుగా చెప్పినా కుమారునిలో మార్పు శూన్యం. రెండవవాడు ఆదిత్య తండ్రికి తగ్గ తనయుడు. ఎప్పుడూ శ్రమించి పని చేయడంలోనే ఆనందాన్ని పొందుతాడు. తండ్రి

   

    ఒకరోజు రామయ్య మిత్రుడు రంగయ్య పనిలో పనిగా రామయ్య ఇంటికి వచ్చాడు. "రామయ్యా! మన స్నేహబంధం చాలా గొప్పది. మన నెయ్యాన్ని వియ్యంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది కదా! మీ చిన్నోడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయాలని ఉంది." అన్నాడు. రంగయ్య కూతురు చాలా అందంగా ఉంటుంది. మంచి గుణవంతురాలు. రంగయ్య మాటలకు రామయ్య సంతోషం వ్యక్తం చేశాడు. అయితే రంగయ్య కూతురును తనకే ఇచ్చి పెళ్ళి చేయాలని చంద్రం పట్టు పట్టాడు. రంగయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. "సరే! మీ అన్నా తమ్ముళ్ళు ఇద్దరికీ చెరొక పాడి ఆవును కొనిస్తా. సంవత్సరంలో ఎవరు ఎక్కువ లాభాలను సంపాదిస్తే వారికి నా కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తా." అన్నాడు.


    ఆదిత్య రంగయ్య తనకు ఇచ్చిన పాడి ఆవు పాలను పిండుతూ నిజాయితీగా అమ్ముకుంటున్నారు. నాణ్యమైన కల్తీ లేని పాలు, తక్కువ ధరలో. ఆదిత్య వద్ద పాలు కొనే వారి సంఖ్య ఎక్కువైంది. వచ్చిన లాభాలతో మరొక పాడి ఆవును కొని పాలు అమ్ముతున్నాడు. ఆదిత్యకు మంచి పేరు కూడా వచ్చింది. చంద్రం రంగయ్య తనకు ఇచ్చిన పాడి ఆవును ప్రతిరోజూ ఊరూరా తిప్పుతూ "అమ్మా, అయ్యా! ఆవొచ్చిందమ్మా ఆవు. గోమాతకు కానుకలు ఇస్తే మీకు మంచి జరుగుతుంది." అని చెబుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఊరూరా ఓపికగా తిరుగుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ కష్టపడి పని చేసే ఉపాయం చేయలేదు. సంవత్సరం గడిచింది. రంగయ్య ఇద్దరు అన్నా తమ్ముళ్ళు డబ్బులు సంపాదించిన విధానాన్ని తెలుసుకున్నాడు. 


     సంవత్సరం తర్వాత రామయ్య ఇంటికి వచ్చిన రంగయ్య తన కూతురిని ఆదిత్యకు ఇచ్చి పెళ్ళి చేస్తానని ప్రకటించాడు. ఇది అన్యాయమని, తమ్మునికన్నా తాను ఎక్కడ సంపాదించానని చంద్ర

 అన్నాడు. అప్పుడు రంగయ్య ఇలా అన్నాడు. "నీ తమ్ముడు న్యాయమైన మార్గంలో పాల వ్యాపారం చేసి, ఎంతోమందికి మేలు చేశాడు. ఇంత మంచి మనసున్న నీ తమ్మునికి ఇస్తే నా కూతురు సుఖపడుతుంది. గోమాతను పూజించడం మంచిదే. కానీ జనాల భక్తిని సొమ్ము చేసుకోవడం తప్పు. నీ వల్ల ఇతరులకు ఏ ఉపయోగం లేదు. నీకు యాచకులకు తేడా లేదు. కష్టపడి జనాలకు ఉపయోగపడే ఏదైనా పని చెయ్యి. బాగుపడుతావు." అన్నాడు రంగయ్య. చంద్రం సిగ్గుతో తల దించుకున్నాడు. రంగయ్య తన కూతురిని ఆదిత్యకు ఇచ్చి పెళ్ళి చేశాడు.


.



Rate this content
Log in