ముక్కు పుడక
ముక్కు పుడక
1 min
117
ముఖానికి ముక్కుపుడక కాంతినిస్తే
నింగి ముక్క పుడకై కీర్తి కాంతి నిచ్చింది.
సూర్య కాంతి భూమికి వెలుగునిస్తే
అబలలకు ధైర్యపు వెలుగై నిలిచింది. వినీలాకాశంలో చేతి రెక్కలు ఆడిస్తూ
నీటి బుడగలే అమృతపు బిందువుల్లా సేవిస్తూ!
నింగిలో విహరించిన వింత పక్షి ఆమె,
పుడమికి తిరిగి వచ్చిన వీర ధీర వనిత ఆమె.
నింగి సునీతులు వివరించి జగజ్జెతయై!
వీర తిలకం దిద్దించుకుంది ఆమె.
సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ నా చిన్ని కవిత
