బుద్ధి పవిత్రం
బుద్ధి పవిత్రం
బుద్ధి పవిత్రం ( కథ)
****************వెండికట్టు నారాయణ
సాయంత్రం కాగానే! పిల్లలంతా! రాముని దేవాలయంపై దుప్పట్లు వేసి స్థలాలను కేటాయించు కుంటారు. పైకెక్కి, నింగి చుక్కల కింద ఆనందంతో నిద్రించడానికి. పిల్లలంతా రాజయ్య కథలు చెప్తుంటే వింటూ! అందంగా అందరూ! నిద్రించారు.
అందరూ నిద్రించిన తర్వాత రాజయ్య శీనయ్యతో ఇలా అన్నాడు."ఒరేయ్ శీనా !వెన్నెల వెలుగు తేటగుంది.తోటల్లోనికి వెళ్దాం పదరా! పండ్లు తుంచుకొని తెచ్చుకొని తినొచ్చు" అని.
సరే! పదమని ఇద్దరు,లేసి మెల్లగా చప్పిడి చేయక,ఎవరికి కనపడక తోటలోనికి వెళ్లి, వారికి ఏ పండ్లు కావాలో తుంచు కుంటూ! గుసగుసలాడు కుంటూ! యధా స్థానానికి చేరుకున్నారు. సంతోషంగా పక్కవారికి తెలియకుండా ఆరిగించి,నిద్రించారు.
తెల్లవారే సరికల్లా! పండ్ల తోళ్ళను గమనించి, పక్కనున్న పిల్లలు అడిగారు, దాంతో శీనయ్య రాజయ్య పై నింద వేశాడు. తోటి పిల్లలందరూ ఊరి వాళ్లకు చెప్పారు. రాజయ్య మిక్కిలి మూర్ఖుడు,లోభి , స్నేహ ధర్మాన్ని పాటించని వాడు, మొత్తానికి, దుష్టుడు.
అది పచ్చని పల్లెటూరు, ప్రక్కనే నది ప్రవహిస్తా ఉంటుంది,చుట్టు ప్రక్కలంతా రకరకాల పండ్ల తోటలు
నిమ్మ తోట, మామిడి తోట, జామ తోట, కొబ్బరి తోట, మొదలైన వనాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపారం కూడా సమృద్ధి గానే జరుగుతూ ఉంటుంది.
మరుసటి రోజు ఊరిలోని రైతులు రాజయ్య ఇంటి పైకి వెళ్లి మా చేలోని పళ్ళను దొంగిలించడమే కాక చెట్ల పైకి ఎక్కి రెమ్మలన్నీ విడిచాడంటూ గొడవ చేశారు.
తన గురించి చెడుగా చెప్పిన, అవమానించిన, బాధపడేవాడు కాదు. నమ్మకద్రోహం చేశాడని, చింతించాడు. నీటిలో పడిన నెయ్యి చుక్కలు చెరువు అంత వ్యాపించినట్లు. ప్రక్కన ఉన్న పిల్లలు రాజయ్య పైకి పురమాయించారు. కొడితే రాక్షసానందాన్ని పొందాలనే ఉబలాటంతో !దానితో రాజయ్య కోపం తారాస్థాయికి చేరింది. పరాక్రమ సింహం లాగా! వస్తున్న కోపాన్ని ఆపుకున్నాడు ధన బలం ,ఆర్థిక బలం లేక ఓర్పు వహించాడు.
కోరలు లేని పాము. మదములేని ఏనుగు,లోకువైనట్లే కోపం లేని రాజయ్యను చాలా చులకనగా చూశారు.
రాజయ్యకు ఉదయాన్నే పండ్లు పొలాలు తినడం అలవాటైపోయింది. ఎక్కడ ఏ పండు తీసిన తప్పే అవుతుందని, దొంకకు అల్లుకున్న దొండ పండ్లు, ఎర్రి తీగ ద్రాక్ష పండ్లు తినేవాడు.
అది చూడలేక వాళ్ళ అమ్మ తులసమ్మ కూలి పనులకు వెళ్లి బెండకాయలు టమోటాలు తెస్తూ, వాడికి ఇస్తే తిని వాటితోనే సర్దుకు పోయేవాడు, రాజయ్య.
అడవులు కాల్చే అగ్నికి, వాయువు మిత్రుడైనట్లు.
ఆ వాయువే సూక్ష్మ రూపంలో ఉన్న అగ్ని ఆర్పేస్తుంది అన్నట్లు, దుష్టునితో స్నేహం పనికి రాదను కున్నాడు.
కొంతకాలానికి ఉన్నత చదువుల కోసం శీనయ్య పట్టణానికి బయలుదేరాడు. రాజయ్య శీనయ్యల స్నేహం ఎడమైపోయింది.
రాజయ్య సమీపంలో ఉన్న ఋషి ఆశ్రమం లాంటి గురుకులం ఒకటి ఉంది. అందులోనికి ప్రవేశించాడు. అక్కడ యోగ్యులైన మంచి పిల్లలు ఉన్నార. వాళ్ళందరూ మంచి విద్యావంతులు తెలివిగలవారు. సభ్యత కలవారు. వారితో స్నేహం బాగా పాతుకు పోయింది. మంచి మంచి కార్యాలు నేర్చుకున్నాడు. దొంగతనం కూడా మానేశాడు.
అక్కడున్న గురు కుమారులలో గొప్పవాడిగా పేరు సంపాదించాలని,ఆచరణలో కూడా సహజత్వాన్ని పాటించాడు.ఉదయాన్నే లేచేవాడు నదీ జలంతో చన్నీటి స్నానం చేసేవాడు. ఎల్లప్పుడూ దైవ ధ్యానం చేయడం కూడా నేర్చుకున్నాడు. పూజ చేయడం వేదా ధ్యయనాలు వల్లించడం పండ్లు ఫలాలు ఆరగించడం ఏక సంతా గ్రాహిగా మార్పు చెందాడు.
ఇలా కొంతకాలానికి "యథా అన్నం,తథా మనః" అన్నట్లు, రాజయ్య మనస్సు మారింది. ఋషి జీవితం లాగా ఉండాలని ఆశించాడు. విద్య పూర్తి చేసి,ఉన్నతమైన చదువు చదివి, విద్యావంతుడుగా పేరు సంపాదించి, ఉన్నత ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు.
మంచి మంచి కథలు కథానికలు రాస్తూ కవిగా స్థిరపడ్డాడు. ఈ సాయికి రావడానికి చిన్నతనం నుండి తిన్న పళ్ళు పలాలే కారణమని రాజయ్య గట్టిగా నమ్ముతాడు.
అందుకే తాను రెండు ఎకరాల పొలం కూడా కొన్నాడు . అందులో తనకు కావలసిన పండ్లు, ఫలాల, పంటలను వేయడానికి కొంతమంది కూలి వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు.
అమ్మానాన్నలకు ఏ లోటు లేకుండా ఎటువంటి కష్టాలు రాకుండా ఆనందంగ ఉంచుతూ! సొంత ఇంటిని కట్టించి అందులో పార్వతీ పరమేశ్వరులుగా ఉంచి సేవలు చేసుకుంటూ, ఏ రోగాలు లేక మంచి ఆరోగ్యంతో! మంచి మనసుతో !మంచి మాటల భావాలతో అందరికీ సేవ చేస్తూ, మంచి పేరు సంపాదిస్తూ, పిల్లాపాపలతో, ఆనంద జీవనం సాగిస్తున్నాడు.
------+--+------------++---+--------------+--++-----------
పట్టణానికి బయలుదేరిన శీనయ్య కార్పొరేట్ విద్యలలో మంచి పట్టు సాధించాడు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలడు. ఎల్.ఎల్.బి పూర్తి చేసి లాయర్ అయ్యాడు, మంచి మంచి కేసులను వాదిస్తూ, డబ్బులు బాగా కూడ బెట్టి రెండు అపార్ట్మెంట్ కూడా కట్టించాడు . జనం అతడిని తెలివైనవాడుగా భావించారు. దూర ప్రాంతాల నుండి అతని దగ్గరికి వచ్చేవారు. అటువంటి వాళ్లలో ధనికులు, పేదవాళ్లు, వ్యాపారస్తులు, ఇలా రకరకాల వాళ్ళు శీనయ్య దగ్గరికి వచ్చేవారు.
లాయర్ శీనయ్య అనే పేరు బాగా వ్యాపించడంవలనచుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలేక పండ్లు ఫలాలు తీసుకొని వస్తుంటే వాళ్లతో ఇలా అనేవాడు, ఇవి పల్లెవాళ్ళు తింటూ ఉంటారు,ఇది మేకల తిండి అంటూ! కొట్టి పారేస్తాడు.
తంసప్ లు .కో కో,కోలాల్లు.డిఫ్ ఫ్రిజ్ పదార్థాలు కోరుకుంటాడు.ఉదయం లేచిందే తడవుగా కాఫీ టీ ఆర్భాటమే.ఫ్రిడ్జ్ నుండి తీసిన కూల్ జ్యూస్ బాటిల్లు,
డబ్బాలో నిలువ ఉంచిన మ్యాంగో జ్యూస్ లాంటి ద్రావణాలు, గంట గంటకు సేవిస్తూనే ఉంటాడు.
ధూమ పాన మత్తు, పదార్థాలకు లోనైపోయాడు. పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటాడు.
వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది.
కడుపు అంతా బాగా లావై డాక్టర్లకు చూపించాడు. కడుపు కోసి లోపల ఉన్న కొవ్వు పదార్థాలన్నీ తీసివేయాలని, అందుకు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని సూచించారు.
వారం రోజులు ఎటువంటి బయటి పదార్థాలు తీసుకోవద్దని ఫ్రెష్ గా ఉన్న పండ్లు ఫలాలు జావలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. చేసేది లేక వాటిని తినడం వల్ల చిన్నతనంలో జరిగిన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చాయి.
రాజయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలని, అతనికి చేసిన అపకారం క్షమించ రానిదని, మనసులో చింతిస్తూ పల్లె పచ్చదనాలు, పల్లె పండ్లు ఎంతటి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయో !కదా! అనుకొంటూ శస్త్ర చికిత్స అయిన తర్వాత సొంత ఊరు వెళ్లాలని, అందుకైనా ప్రాణాలతో తిరిగి రావాలని మనసులో భగవంతున్ని ప్రార్థించు కుంటూ !ఆపరేషన్ థియేటర్ లోనికి బయలుదేరాడు శీనయ్య.
