అంతా! మనమంచికే
అంతా! మనమంచికే
అంతా! మన మంచికే!
*******************
(ఇది నా సొంత సృజన
ఎవరి అనుకరణ కాదని హామీ)
సూర్యుడు ఇంకా! ఉదయించటమే లేదు. పనిచేయాలనే! ఉబలాటం తగ్గటమే లేదు. చన్నీటి స్నానం చేసి చద్దన్నం తిని బండల డిపోకు బయలుదేరి వెళ్ళాడు రామయ్య!
డిపో సాంబయ్య నిద్రలేచి కళ్ళు పులుము కుంటు 'రామయ్య కాఫీ తాగి పోవయ్య అంటూ పిలుపులో ఆప్యాయత కనబరుస్తాడు. ఎంత వద్దన్నా విని పించుకోడు. కోత బండల కొలతలు ఆపేసి వచ్చి, వేప చెట్టు కింద ఉన్న అరుగుపై కూర్చున్నాడు
సాంబయ్యకు కూతురు ఒక్కటే శారదమ్మ చదువు లమ్మ,ముచ్చటైన చిలుక పలుకులతో ముద్దొస్తుంది.
కప్పు నిండా! వేడికి కాఫీ పట్టుకొని లోపల నుండి తొలగి పోకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ,!
రా..! తాతయ్య త్వరగా! కాలుతోంది అంటూ, మురి పెంగా పిలుస్తుంది ఎవరో తెలియకపోయినా బంధాలు కలిపేసు కుంటూ !! ఆ మాటలకు ఎంతగా మురిసి పోతాడో! రామయ్య, ఎదురుగా వెళ్లి చిన్నారి చేతులు కంద కుండ కాఫీ కప్పు అందుకుంటూ!!
బుగ్గలు గిళ్ళుతూ "బాగా చదువుకో వమ్మా! చిట్టెమ్మా! బండ రాతి పనులు నీకు వద్దమ్మా? బండ మనసు రానీ యొద్దమ్మా"! అంటూ ముచ్చటగా వేడుకుంటూ చేప్పాడు.
ఎంత కాలం నుండో! పనిచేస్తున్నా ! ఏనాడు అలుసుగా మాట్లాడింది లేదు. దగ్గరికి వచ్చి కబుర్లు ఆడింది లేదు. ఎప్పుడూ యజమానిని కొత్తగానే భావిస్తాడు. ఉదయాన్నే వస్తాడు. పగలంతా అస్తమానం పని చేస్తాడు పొద్దు గూకిన తర్వాత వెళ్తాడు.
రామయ్య పేరుకు కూలివాడైనా పనులన్నీ చూసుకునేది తానే! బండ లన్నీ లోడ్ దింపుకొనేది పని వాళ్లకు పనులు పురమా యించేది, ఎన్ని బండలు కొయ్యాలో, ఎన్ని బండలు పాలిష్ పెట్టాలో! మొదలగున వన్నీ నోటి లెక్కలేసి చెప్పేస్తాడు.
బేరాలు ఆడి బండలు అమ్మిచ్చేది, డబ్బు లాభం ఇప్పించేది, అంతా రామయ్యే చూసుకుంటాడు. సాంబయ్యకు ఎంత చెప్పినా వినకుండా కల్లు తాగి కలలు కంటూ మత్తులోనే విహరిస్తాడు. పెద్ద వ్యాపారమనీ విశ్వాసం వీడ లేక ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు.
రామయ్య మీది ప్రేమతో అప్పుడప్పుడు సాంబయ్య కల్లు తాగమని ఒంటినొప్పులు ఏవి ఉండవని బలవంత పెడతాడు. కానీ "రామయ్య బండ బరువులు తెలిసినోడు బతుకు బరువు చూసినోడు కష్టాల్లోనూ సుఖాలలోను బతుకు తీపి తెలుసుకున్నోడు."
సున్నితంగా తిరస్కరించాడు.
జీవితాలు అణగారి పోతాయని మత్తును వదిలి హాయిగా పిల్లా పాపలను సంసారాన్ని చూసుకుంటూ ముచ్చటగావిస్తూ పదిమందికి పని చూపెట్టమని వేడుకున్నాడు రామయ్య.
కాలం జరిగిపోయింది. వ్యాపారం పడిపోయింది. శారదమ్మ డాక్టరై విదేశాల్లో స్థిరపడిపోయింది.
ఉన్న ధనమంతా తాగుడుకు ఖర్చు పెట్టేశాడు,
బంధువులందరూ, దూరమై పోయారు. భార్యకు జబ్బు చేసి నిమ్మలించింది పట్టించుకోక మరణించింది.
దీనితో ఇంకా మందుకు బానిస అయిపోయాడు.
కాళ్లు చేతులు చచ్చు పడిపోయాయి. పక్షవాతం కొట్టింది. మాట పడిపోయింది. మూతి వంకర పోయింది. చేసేది లేక ఊపిరి గట్టిగా బిగపట్టి బలవంతంగా మరణించాడు సాంబయ్య.
శారదమ్మ వచ్చింది. అంత్యక్రియలన్ని జరిపించింది.
తెల్లవారి రామయ్య వచ్చాడు. దగ్గరికి పిలిచి చూడు తాత "నీవు ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేసే పరోక్షంగా మా కుటుంబానికి సాయం" చేశావు.
ఎందరో వచ్చారు పనిచేశారు వెళ్లిపోయారు. కానీ కష్టం వచ్చినా లాభం వచ్చిన చివరి వరకు ఉన్నది నీ ఒక్కడివే! కాబట్టి ఈ వ్యాపార మంతా నీవే! చూసుకో! నీ వెనక నేనుంటా నంటూ,తాతకి అప్పగించింది.
రామయ్య మేనేజర్ అయ్యాడు. ఇప్పుడు అది శారదమ్మ డిపోగా పేరుసంపాదించుకుంది.
ఎంతోమందికి పని కల్పించింది. అనాధలకు ఆశ్రితులకు సహాయ సహకారాలు అందిస్తుంది.
(ఉన్న దానిని వదిలిపెట్టకుండా చూసుకుంటూ!
ఉంటే ఏదో !ఒక రోజు దైవాను గ్రహం తప్పక లభిస్తుంది అన్నది నీతి.)
✍️వెండి కట్టు నారాయణ ✍️
