STORYMIRROR

VENDIKATTU NARAYANA

Others

4  

VENDIKATTU NARAYANA

Others

మనసు మార్చుకుంది

మనసు మార్చుకుంది

3 mins
365

మనసు మార్చుకుంది.
******************* (ఇది నా సొంత సృజన ఎవరి అనుకరణ కాదని హామీ)
 చూడు "రాణి వేళగాని వేళప్పుడు వచ్చి, బంగారం లాంటి మా నిద్రను పాడు చేస్తావా!" ఇది మంచిది కాదంటూ చివాట్లు పెట్టి రెండు దెబ్బలు కూడా వేసింది మోహన. ఆ దెబ్బల నొప్పి భరించలేక అరుచుకుంటూ పక్కకు వెళ్లిపోయింది రాణి. తెల్లవారే సరి కల్లా దొడ్డి వాకిట దొంగలు ఇంట్లో చొరబడి దొరికిన దంతా పట్టు కెళ్ళిపో యారన్న వార్త వీధి అంతా ప్రాకింది. రాత్రి  కొట్టినందుకు తగిన శాస్తి జరిగిందని కొందరు. అయ్యో! పాపం అనేవారు కొందరు ఇలా రకరకాలు. దాంతో రాణి క్రేజీ బాగా పెరిగిపోయింది. అది అంటే అందరికీ చాలా ప్రేమ ఎక్కువైంది. పప్పు అన్నం కలుపుకొని గిన్నెలో పెట్టుకొని దానికే పెట్టాలని ఎదురు చూసేవారు ఎక్కువైపోయారు. వీధిలో ఎన్నో కుక్కలున్నా దేనికి ఒక మేతకు రాల్చరు. రాణికి తప్ప. కాలభైరవుడు అన్నదానికి నిదర్శనమే ఇది.ప్రతి ఇంటి దగ్గరికి వెళుతుంది. మొరుగు తుంది,అన్నం పెట్టేంత వరకు పక్కకు మల్లదు. అదొక విచిత్ర శునకం. కోప పడేవారు చాలా అరుదుగా ఉంటారు. అందరిని చాలా కవ్విస్తుంది. ప్రేమగా తోక ఆడిస్తూ,వినయంగా దగ్గరికి చేరుతుంది. నడక రాణి నడకే పిల్లలందరూ చుట్టూ చేరి వీపు పైకి ఎగాప్రాకే వారు కొందరు. విసిగించే వారు కొందరు అది చూసిన మోహన పిల్లలందరినీ చెదరగొట్టి, "ఏమే మొరగొచ్చు కదా!  ఒట్టి మనిషి కూడా కాదు."అని ప్రేమతో మందలించింది." ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందంటే ఇదే నేమో""! కడుపుతో ఉన్న దాన్ని కొట్టినందుకు నా ఇంట్లో దొంగతనం జరిగిందే మోనని మోహన అనుమానం. అందుకని దాన్ని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టింది. మోహన భర్త మిలటరీలో ఉద్యోగం చేస్తూ,దేశ సేవకులో తరిస్తున్నాడు. సంతానం కోసం ఎక్కడెక్కడో తిరిగారు ఫలితం లేకపోయింది. వీధి అంతా పని చేసుకొనే కూలీలు ఎక్కువ పగలంతా కష్టపడి రాత్రి వచ్చి రాగానే అలిసిపోయి గాఢనిద్రలో మునిగిపోతారు. అందుకని ఆ రాణి కుక్కకు మంచి అన్నం పెట్టి ఆదరిస్తారు. రాత్రంతా పహారా కాస్తూ, కాపలా ఉంటుంది.ఇంటింటికి వెళ్లి, మొరిగి మెలకువగా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. ఎవరింట్లో దొంగతనం జరిగేది వెంటనే పసిగడుతుంది ఆరోజు ఆ ఇంటి నుండి పక్కకు రాదు. ఆ ఇంటివారు గమనించి ఒకరు కొద్దిసేపు నిద్రించి మరొకరు మెలకువగా ఉండి, తమను తాము సంరక్షించు కుంటారు. అందుకు రాణికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. రాత్రి మొరిగే అరుపులకు ఒక్కొక్క అర్థం ఉంటుందంటారు. అర్ధరాత్రి ఓ!యజమాని మేలుకోవయ్యా! ఈ జామున మీ ఇంట్లో దొంగలు పడతారని మొరుగుతుందట, ఓ! దేవతలారా! ఎంతకాలమని పిడికెడు అన్నం తిని విశ్వాసంగా జీవించాలని, కరుణించి ముక్తిని ప్రసాదించమని, తెల్లవారు జామున ప్రార్థనతో దేవతల్ని ప్రార్థించి నట్లు మొరుగు తాయట! వీధిలో ఒక చప్పుడు వినిపించిన, కొత్త వ్యక్తి కనిపించిన, దాని అరుపు సాధారణంగా ఉండదు. వీధిల్లి పాది దాని దగ్గరకు చేరి, సముదా యించాలి. కరిచే ప్రసక్తి, లేక పోయిన అరుపులే ఎక్కువ. అందుకే "అరిచే కుక్క కరువ దంటారేమో "!ఈ రాణి కూడా అలాంటిదే ! పగలంతా మేడ పైకెక్కి పిట్ట గోడ పైన పహారా కాస్తూ, కాసేపు సేద తీరుతుంది. మధ్యాహ్నం పనులు ముగించుకొని అందరు ఇండ్లకు వస్తారు. ఇంటింటి దగ్గరికి వెళ్లి ఒక్కసారి మాత్రమే అరుస్తుంది. గమనించి నోళ్లు మాత్రమే అన్నం పెడతారు. ఎవరు పెట్టకపోతే మోహనా ఇంటికి వెళ్లి, నిలబడుతుంది. సంతోషపడి ఒక ముద్ద సంగటి పెడుతుంది. ఇలా కాలం గడిచిపోయింది. వర్షాకాలం సమీపించింది. రాణి ప్రసవన వేధనతో భయంకరంగా అరుస్తూ వామి దొడ్లో !చూడ సక్కని, నలుపు, తెలుపు, రంగులతో ,నలుగురు పిల్లల్ని కనింది. అందరి వెళ్లి చూసి సంతోషపడ్డారు. వర్షానికి తడవకుండా రేకులు అడ్డుగా పెట్టారు. ఆ మరుసటి రోజు దానికి సమీపంలోని ఒక పంది పది పిల్లలను కన్నది. అది చూసి రాణికి పిల్లల్ని మీది మమకారంతో క్రూరత్వం ఎక్కువైపోయింది. రెండు రోజులకు ఓ!సారి పంది లేని సమయంలో ఒక పంది పిల్లను పట్టుకొచ్చి చంపి, పిల్లలకు ఆహారంగా పెట్టడం అలవాటు చేసింది. ఇలా పంది పిల్లలని ఖాళీ చేసింది. అది గమనించిన పంది పిల్లల కోసం వెతికి, వెతికి, కుక్కపిల్ల దగ్గర ఉన్న, తన పిల్ల సగం మాంసపు ముద్దను గమనించింది. నా పిల్లల్ని చంపుతావా? అనుకుందేమో !మరుసటి రోజు నుండి తన నలుగురి పిల్లల్ని కొరికి  చంపి పడేసింది. ఆ బాధ తట్టుకోలేక ఎన్ని రోజులు ఏడ్చిందో! నిద్ర లేక తిండి లేక ఎన్ని జాగా హారాలు చేసిందో! ఆ అరుపులు, ఆర్తనాదాలు, ప్రతి ఒక్కరి మనసులను కదిలించి వేశాయి. ఈ విధంగా రెండు పర్యాయాలు తన సంతానాన్ని పందికి, పంది సంతానాన్ని తాను,బలి తీసుకున్నాయి. ఈసారి మనసు మారిందో! కాలమే మార్చేసిందో! బుద్ధి తెచ్చుకుంది రాణి ,తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, పంది పిల్లలను కూడా కాపాడటం మొదలుపెట్టింది. అది గమనించిన పంది కూడా కుక్క సంతానాన్ని ఏమి చేయకుండా వదిలేసింది. ఇప్పుడు రాణి నిజంగానే వీధి మహారాణిగా ఐదుగురి పిల్లలను వెంట బెట్టుకొని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, దర్జాగా ! నడుస్తుంటే ఎంత ముచ్చట వేస్తుందో!  వీది వాళ్లంతా దాన్ని మార్పుకు సంతోషించారు. దానినచూసి కొందరు అనుకరించి పక్కవారితో  స్నేహంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. (పక్కవారి ఆనందాన్ని చెడగొట్టి, మనం మాత్రమే ఆనందంగా ఉండాలనుకోవడం మంచిది కాదు.) ✍️వెండి కట్టు నారాయణ ✍️        


Rate this content
Log in