వలనే
వలనే
1 min
1
తానెవరో తెలియలేక..పడిపోయెను వలనే..!
ఈ 'నేనే' నిజమనుకుని..తా చిక్కెను వలనే..!
అంటికూడ అంటనట్లు..ఉండలేక అలజడి..
నాటకమున పాత్రగాక..మరి వగచెను వలనే..!
ఏది కలో ఏది నిజమొ..తేల్చకునే దెప్పుడు..
వింతపరుగు తీస్తూనే..విరగబడెను వలనే..!
బ్రతుకుతీపి ఎంతున్నా..ధ్యాసలేని తనమే..
వెర్రిమనసు గారడిచే..పట్టుబడెను వలనే..!
ఎవరితీరు నెవరు మార్చ..కుదిరేనట నిజముగ..
జ్ఞాపకాల మూటతోనె..కూలబడెను వలనే..!