నవ వసంతం
నవ వసంతం
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
0
నవవసంత పరిమళ ధుని..పంచుతూనె ఉంటుంది..!
వేసవినే మరపించగ..నలుగుతూనె ఉంటుంది..!
అలుకతెఱలు తొలగించే..పుణ్యరాశి తానేను..
ప్రేమయజ్ఞ వాటికలో..కాలుతూనె ఉంటుంది..!
మొగ్గలోనె కోయబడుతు..ఏ సిగలో కెక్కునో..
నునుసిగ్గులు పండించగ..ఒదుగుతూనె ఉంటుంది..!
కొండమల్లె బొండుమల్లె..తీగమల్లె చిటిమల్లె..
రాచమల్లె రాణిమల్లె..నవ్వుతూనె ఉంటుంది..!
రాగమల్లె దీపమల్లె..నాగమల్లె నవమల్లె..
ప్రేమమల్లె భోగమల్లె..వెలుగుతూనె ఉంటుంది..!
మోహమల్లె మోజుమల్లె..మోదమల్లె సిరిమల్లె..
వేదమల్లె ఊహమల్లె..పాడుతూనె ఉంటుంది.