నీ చూపుల గొడుగు నీడ
నీ చూపుల గొడుగు నీడ
1 min
5
నీ చూపుల గొడుగునీడ..ఊరిస్తూ ఉన్నది..!
నీ నవ్వుల పూలతోట..బ్రతికిస్తూ ఉన్నది..!
వలపుపాట వరదైతే..ఆనకట్ట ఎలాగ..
నీ తలపే రెప్పలతో..కలహిస్తూ ఉన్నది..!
నిన్నెప్పుడు మొదటిసారి..చూశానో ఏమో..
మనసేమో చిత్రముగా..ఉడికిస్తూ ఉన్నది..!
నీ చెక్కిలి సిగ్గుపూల..జల్లదెంత మధురం..
మత్తుమందు నా ఎదలో..కురిపిస్తూ ఉన్నది..!
పద్యమైన పాటైనా..నీ ఊసుల మధువే..
వ్రాయబోతె తనకుతానె..ప్రవహిస్తూ ఉన్నది..!
కవ్వింతల గోలలేదు..వింతహాయి వానే..
నేనన్నది మేనుమరచి..నర్తిస్తూ ఉన్నది..!