నాన్న
నాన్న
1 min
5
నాన్న మనసు సరిగతెలిసి..నడవాలని ఉన్నది..!
నాన్న ప్రేమ విశ్వానికి..చాటాలని ఉన్నది..!
ఎంత తపము సలిపేనో..కర్తవ్య నిర్వహణకు..
నాన్న మాటమాటు వెలుగు..పట్టాలని ఉన్నది..!
దారిదీపమల్లె తాను..నిలచి కరిగిపోవునె..
నాన్న ఆశయాల చెట్లు..పెంచాలని ఉన్నది..!
అమ్మమాట నాదరించు..అమ్మతత్వ మందునె..
నాన్నంతటి నిదాన నిధి..కావాలని ఉన్నది..!
తన బిడ్డల బాగోగులె..లోకముగా తలచునె..
నాన్నతనపు లోతెంతో..చూపాలని ఉన్నది..!
తాను చితికి పోతున్నా..చిరునవ్వే చిందునె..
నాన్నచోటు నాన్నకొఱకె..దాచాలని ఉన్నది..!