నా ఊహలలో
నా ఊహలలో
1 min
4
తన నవ్వుల పసిడివాన..కురుస్తూనె ఉంది..!
తన తియ్యని వలపుపాట..పిలుస్తూనె ఉంది..!
ఏనాటిదొ జ్ఞాపకాల..పూలగొడుగు ఇపుడు..
నులివెచ్చగ నా నీడన..మురుస్తూనె ఉంది..!
చిత్రమైన వనమేదో..చిగురుతొడిగె చూడ..
నా తలపుల జల్లులలో..తడుస్తూనె ఉంది..!
మోహాలకు తెరదించే..నిత్యనూత్న వధువు..
నా బంగరు ఊహలలో..మెరుస్తూనె ఉంది..!
కలికితనపు కావ్యమంటె..తన సొగసుల గని..
చంద్రికలను పానుపుగా..పరుస్తూనె ఉంది..!