ముచ్చట్లు
ముచ్చట్లు
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ప్రేమకు అర్థం..తెలిసిన ముచ్చట..!
చెలిమికి అద్దం..నిలిపిన ముచ్చట..!
వ్యవహారానికి..వేడుక దేనికి..
మాటకు మౌనం..పొదిగిన ముచ్చట..!
గమ్యం తెలియని..పయనం ఏమిటి..
సూటిగ చూస్తూ..నడచిన ముచ్చట..!
తలపుల గోడల..గొడవల గొడవే..
కిటికీ లన్నీ..మూసిన ముచ్చట..!
కులాల మతాల..తీరం ఎక్కడ..
ఎక్కువ తక్కువ..తొలగిన ముచ్చట..!
గంధం బంధం..అందం నిజమే..
నేనో నాదో..ఇగిరిన ముచ్చట..!
దేశం ప్రాంతం..హద్దుల యుద్ధం..
పహరాలన్నీ..పండిన ముచ్చట..!
ఒకటే దైవం..ఒకటే ప్రాణం..
శ్వాసల సాక్షిగ..మిగిలిన ముచ్చట..!
నైవేద్యంగా..వాదం వేదం..
ఉపనిషత్తులా..బ్రతికిన ముచ్చట..!