మారినాయి
మారినాయి
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
2
జ్ఞాపకాల మల్లెలేమొ..కత్తులుగా మారినాయి..!
చెలినవ్వుల మెఱుపులేమొ..పిడుగులుగా మారినాయి..!
మధురమైన విరహమెంత..తేలికంటె చెప్పలేను..
చెలిఅడుగుల జాడలేమొ..పక్షులుగా మారినాయి..!
ఎగసిపడే అలలతోటి..పోల్చలేను నా వలపులు..
చెలివియోగ శిఖలేమో..వాగులుగా మారినాయి..!
భావగగన వీధులన్ని..చెలితలపుల గంధమాయె..
గుండెగొంతు రాగాలే..నిప్పులుగా మారినాయి..!
చీకటెంత ఊరడించు..ఉప్పెనైన మనసుపట్టి..
నా ఆశల తోటలన్ని..బీడులుగా మారినాయి..!
వరమిచ్చిన దేవతయే..కరుణించదె ఎందుకనో..
రెప్పచాటు కలలన్నీ..చిక్కులుగా మారినాయి.