*అవయవ దానం/రక్తదానం*
*అవయవ దానం/రక్తదానం*


*అవయవ దానం/రక్తదానం*
* ప్రపంచంలోని భాషలు
చదవగల్గిన నేత్రం
ఆనందాల వెలుగులు
విరజల్లు జ్ఞాననేత్రం
వారెవ్వా కన్ను
అశ్రద్ధ చేస్తే జీవితమే అంధకారం.
* ప్రాణం విలువ తెలుసుకో
తల్లి పంచిన రక్తం
వృధాచేయకు పరులకు
చేయి ప్రాణదానం
వారెవ్వా రక్తదానం
రక్తం ప్రాముఖ్యత తెలుసుకో.
* మట్టిలో కలిసేటి
దేహానికి లేదు విలువ
వహ్వా! దానమిచ్చినట్టి
అవయవాలకు విలువ
వారెవ్వా అవయవ దానం
చరిత్రలో నీవు సజీవం.
* దైవం ప్రసాదించిన
ప్రాణం విలువ తెలుసుకో
అవయవ దానంచేసి
నీ విలువ పెంచుకో
వారెవ్వా అవయవ దానం
మరొక్కరికి ప్రాణదానం.
* ప్రాణం పోసెతందుకు
వైద్యుడవె కావాల
ఓ మంచి రక్తం దాత
ఐన మరో ప్రాణం నిల్చు
వారెవ్వా రక్తదానం
చుక్క రక్తం మనిషినే కాపాడు.
* ప్రమాదంలో గాయపడి
ప్రాణాలతో పోరాడె
వ్యక్తికి అండ నిలబడు
రక్తదానం చెసి కాపాడు
వారెవ్వా రక్తదానం
ఒక కుటుంబానే రక్షించును.
రచన: బోయ శేఖర్
చిత్రసాహిత్(కుంచె/కలంపేరు)
కర్నూలు