STORYMIRROR

#SM Boss

SEE WINNERS

Share with friends

SM Boss house కు స్వాగతం.

స్టోరీ మిర్రర్ ప్రియ రచయితల కోసం ఒక వినూత్న రచనల పోటీ ని ప్రవేశ పెడుతోంది. అదే SM Boss House పోటీ.

కాన్సెప్ట్

S M boss హౌజ్ లో స్థానం పొందేందుకు మీరు కనీసం ఒక రచన అయినా సమర్పణ చేయాలి. మీకు నియమం ప్రకారం టాస్క్ లు ఇవ్వబడతాయి. మీరు ఒక్కో టాస్క్ తప్పని సరిగా పూర్తి చేయాలి లేకుంటే పోటీ కి అనర్హులు అవుతారు

టాస్క్ లు ఈ కింద ఇవ్వబడతాయి.

టాస్క్ 1

*కథల విభాగం

ఒక ప్రేమ /రొమాంటిక్ కథ వ్రాయాలి. అందులో రెండు ప్రధాన నాయక పాత్రలు రియాలిటీ షో లో గెలిచేందుకు డేటింగ్ చేస్తున్నట్లు నటిస్తాయి. అశ్లీల రచనలు, అక్రమ సంబంధాలు ప్రోత్సహించే రచనలు అంగీకరించ బడవు.

*కవితల విభాగం లో మలి వయసులో ప్రేమ ఆధారంగా 90 నుండి 150 పదాల్లో కవిత రాయాలి.

టాస్క్ 2

కథ విభాగం లో

ఒక అంతరిక్ష సాహస కథ/ కవిత ను ఒక గ్రహాంతర వాసి భూమిని సందర్శించే నేపథ్యంలో రాయాలి.

కవిత విభాగం లో sonnet రాయండి. Sonnet అంటే సంప్రదాయ రీత్యా 14 లైన్స్ లో ప్రేమ గురించి, ముఖ్యంగా కోల్పోయిన ప్రేమ, లేదా విరహ గీతం లాంటి ప్రేమ గురించి వ్యక్తం చేయటానికి ఎక్కువగా రాస్తారు.

టాస్క్ 3

కథల విభాగం లో

పూర్తిగా సరిగ్గా సంవత్సరం పాటు ఒకే గదిలో జరిగేలా ఒక కథని రాయండి.

కవితా విభాగం లో

ఎలిజీ లేదా సంతాప కవితని రాయాలి. ఒక వ్యక్తి లేదా సమూహం గురించి సంతాపం మరియు ఓదార్పు, కొన్నిసార్లు ఆ బాధ నుండి తేరుకుని తిరిగి ఉత్సాహం నింపే విధంగా ఎలిజీ ని రాస్తారు.

టాస్క్ 4

కథల విభాగం లో

ఒక మిస్టరీ కథ రాయాలి. అందులో డిటెక్టివ్ ఆఖరి నిముషంలో తప్పుడు వ్యక్తిని అనుమానించాను అని తెలుసుకునే విధంగా కథను మలచాలి.

కవిత విభాగం లో ఒక బ్యాలే(ballad) ను రాయాలి.

 బ్యాలే (ballad) అంటే?

బ్యాలే అంటే కథ ను లేదా చరిత్రను కవిత రూపంలో చెప్పే లేదా చదివే ప్రయత్నం. జానపద కథలు అలా వచ్చినవే. బసవ పురాణం, రంగనాథ రామాయణం అలా పుట్టిన కావ్యాలు. ఏడు గడియల రాజు అనే తెలుగు వాచకము పాఠం కూడా అలా వచ్చిన కవితే.

ఇంగ్లీష్ లో కీట్స్ రాసిన la belle dame sans mercy అలాంటి కవితలకు ఉదాహరణ.

టాస్క్ 5

కథ విభాగంలో

ఒక పెద్ద వయసు వారైన జంట ప్రేమ కథ రాయండి. వారు టీనేజ్ నుండి ప్రేమించుకున్న వారై ఉండాలి.

కవితల విభాగంలో

మీకు ఇష్టమైన శైలి లో కవిత రాయండి. కానీ ప్రాస నియమం ఉండాలి.

టాస్క్ 6

కథా విభాగంలో

భూమి మీద ఎన్నో సార్లు పునర్జన్మను ఎత్తిన లేదా అవతరించిన వ్యక్తి గురించి కథ రాయాలి. అతనికి పూర్వ జన్మలు గుర్తు ఉండాలి కానీ అతని చుట్టూ ఉన్నవారికి పూర్వ జన్మ గురించి కానీ అతని గురించి కానీ ఏమీ తెలియ కూడదు.

 కవితా విభాగంలో పది లైన్లు మించని హాస్య లేదా వ్యంగ్య కవితని రాయాలి.

నియమాలు

*పోటీదారులు తమ సొంత రచనలే పంపాలి. కాపీ రచనలు స్వీకరించబడవు.

* విజేతలు ఎడిటర్ స్కోర్ మరియు ఎన్ని టాస్క్ పూర్తి చేసారు అనే అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. కంటెంట్ సంఖ్య పై పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్నైనా రచనలు పంపవచ్చు.

 #SM Boss tag ను మీ రచనల్లో తప్పనిసరిగా వాడాలి పోటీ కోసం.


అంశాలు

*కథ

*కవిత

భాషలు

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒరియా, మరాఠీ, మరియు బెంగాలీ.

బహుమతులు

*అన్ని టాస్క్ లు పూర్తి చేసిన రచయితలకి ఒక్కొక్కరికి 150 రూపాయల స్టోరీ మిర్రర్ వోచేర్లు ఇవ్వబడతాయి.

*ప్రతి భాషలో టాప్ 50 రచనలను కేటగిరీ వారీ గా ఒక ఈ -బుక్ గా ప్రచురణ చేయటం జరుగుతుంది.

సమర్పణ గడువు:

ఏప్రిల్ 02, 2021 నుండి 01 మే, 2021

ఫలితాల తేదీ: 31 మే 2021

సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:9372458287