STORYMIRROR

#Message to Mom

SEE WINNERS

Share with friends

మదర్స్ డే లేదా మాతృ దినోత్సవం కేవలం ఒక మామూలు రోజు లేదా వేడుక కాదు. మన జన్మకు కారణం అయిన అమ్మకు కృతజ్ఞత చెప్పుకునే రోజు. మన మాతృమూర్తి పట్ల మన ప్రేమను గౌరవాన్ని చాటుకునే అవకాశం.

స్టోరీ మిర్రర్ ఈ సందర్భంగా అమ్మకో సందేశం అనే కోట్స్ లేదా సూక్తుల పోటీని నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా అమ్మ మనకోసం చేసిన త్యాగానికి, శ్రమకు కృతజ్ఞత తెలుపుకుందాం.

అంశం: రచయితలు కృతజ్ఞతా పూర్వకంగా సందేశాన్ని సూక్తి లేదా చిన్న నోట్ రూపం లో రాయాల్సి ఉంటుంది.

నిబంధనలు:

1.రచయితలు అమ్మకు కృతజ్ఞతా పూర్వకంగా సందేశాన్ని సూక్తి లేదా చిన్న నోట్ రూపం లో రాయాల్సి ఉంటుంది.

2.జానర్ మీద ఎలాంటి విధి నిషేధాలు లేవు.

3.పాఠకుల సంఖ్య, ఆదరణ ఆధారంగా విజేత ఎంపిక ఉంటుంది.

4. రచయితలు తమ స్వీయ రచనలు మాత్రమే పంపాలి. ఒకరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.

5. పోటీకి ఎలాంటి రుసుము లేదు.

6.ఈ మెయిల్ లేదా హార్డ్ కాపీ లేదా పోటీ లింక్ ద్వారా కాకుండా మరే విధంగా రచనలు పంపినా వాటిని అనుమతించబడవు.

7. పోటీలో పాల్గొనేవారు పొందే సర్టిఫికేట్ మీ ప్రొఫైల్ లింక్ ద్వారా పొందవచ్చు.

విభాగాలు:

సూక్తులు లేదా కోట్స్

భాషలు:

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ మరియు ఒరియా

బహుమతులు:

1.పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

2. ప్రతి భాషలో టాప్ 10 విజేతలకు వంద రూపాయల విలువగల స్టోరీ మిర్రర్ షాప్ వౌచెర్ ఇవ్వబడుతుంది.

3. విజేతలు అందరికీ విజేత ప్రశంసాపత్రం ఈ - సర్టిఫికేట్ గా ఇవ్వబడుతుంది.

పాల్గొనే తేదీలు: 28 ఏప్రిల్ 2021 నుండి 15 మే 2021

ఫలితాలు: జూన్ 02, 2021