నిష్కల Nishkala

Drama Children Stories

4.2  

నిష్కల Nishkala

Drama Children Stories

నాన్నే మార్గదర్శి

నాన్నే మార్గదర్శి

3 mins
210


శ్రీకర్ సీట్ లోంచి మళ్ళి లేచాడు ఇంకా పన్నెండు కూడా కాలేదు ఇది రెండో సారి బ్రేక్ తీసుకోవడం వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు . అందుకే మెల్లగా లేచి స్మోకింగ్ జోన్ వైపు అడుగులు వేసాను , నేను ఊహించినట్టే శ్రీకర్ అక్కడే ఉన్నాడు . అతని ముఖం లో ఆందోళన సృష్టం గా కనిపిస్తుంది , కళ్ళు ఎర్ర గా ఉండటం మూలాన రాత్రి సరిగా నిద్ర పోలేదు అని అర్ధం అయింది.

            "శ్రీకర్ ఏంటి రా? ఎందుకంత ఆందోళన గా ఉన్నావ్ ? ఇప్పటికే ఒక ప్యాకెట్ కాల్చావ్ , ఇంక చాలు . అసలు ఏమైందో చెప్పు ? " అన్నాను వాడి చేతిలో ఉన్న సిగరెట్టు కింద పడేసి.

     శ్రీ కర్ తల దించుకుని ఒక నిట్టూర్పు వదిలాడు " ఏమి చెప్పాలో తెలియటం లేదు , ఇలాంటి పరిస్ధితి వస్తుందని అనుకోలేదు " అన్నాడు నాకు కాస్త భయం వేసింది వాడు ఎప్పుడు ఇంత అధైర్యం గా మాట్లాడలేదు అంటే ఎదో తీవ్రమైన సమస్య అయి ఉంటుంది .

"ఏమి రా ఇంట్లో ఏమైనా ఇబ్బందా? ఎవరికైనా ఆరోగ్య సమస్య ? డబ్బు ఏమైనా కావాలా " అని అడిగాను కాని నాకు తెలిసి వాడు డబ్బు గురించి ఇంత గా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది ఉన్న తట్టుకునే స్థోమత ఉంది వాడికి.

"డబ్బు కాదు రా పిల్లల సమస్య " అన్నాడు శ్రీకర్ నేను వాడి ని ఆశ్చర్యం గా చూడటం చూసి వాడు విరక్తి గా నవ్వి చెప్పడం మొదలు పెట్టాడు " నిన్న విరాట్ స్కూల్ నుండి వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది వాడు ఇంట్లో నా సిగరెట్టు ప్యాకెట్ దొంగలించి స్కూల్ కి తీసుకెళ్ళి అక్కడ ఉత్త సిగరెట్టు నోట్లో పెట్టుకుని సిగరెట్టు ఎలా కాల్చాలో వాడి ఫ్రెండ్స్ కి చూపిస్తున్నాడoట పిల్లల ముందు అలాంటి అలవాట్లు తగ్గించుకొండి ఇంకోసారి ఇలా జరిగితే ప్రిన్సిపాల్ దృష్టి కి తీసుకువెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది టీచర్ " అని కాసేపు ఆపి మళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు.

" పదేళ్ళు రా వాడికి వాడిని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది కాని ఏమి చెయ్యను వాడు నన్ను చూసి అలా చేసాడు అని అనుకుంటున్న ప్రతి సారి పిచ్చి ఎక్కుతుంది రా . నా భార్య ముఖం చూడటానికి కూడా ధైర్యం చేయలేక పోయా , నేను బాధ పడుతుంటే తనే ఓదార్చి మా పాప అన్న మాట చెప్పింది అది విన్నాక నా గుండె ఇంకా పగిలిపోయింది " అని ఏడుపు ముఖం పెట్టాడు శ్రీకర్ .

"ఏమంది రా ?" అని అడిగాను శ్రీకర్ ని ఆ పరిస్ధితి లో చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది.

" వాళ్ళ అమ్మ ని ఓరోజు అడిగిందoటా ' అమ్మా మా స్కూల్లో డ్రింకింగ్ , స్మోకింగ్ చేసేవాళ్లు బాడ్ బాయ్స్ అని చెప్పారు , మరి డాడీ కూడా బ్యాడ్ బాయ్ ఆ ! ' అని నాకు తల కొట్టేసినట్టు అయింది నేను ఎంత బాగా వాళ్ళని చూసుకున్నా నా అలవాట్ల వల్ల వాళ్ళ దృష్టిలో నేను చెడ్డ వాడిని అయిపోతున్నాను " అని అన్నాడు.

" అంతే రా పిల్లలు ఎప్పుడు తల్లి తండ్రుల నే ఉదాహరణ గా తీసుకుంటారు మనం వెళ్లిన మార్గం లొనే వెళ్తారు అందుకే మన నడక ,నడవడిక బాగుండాలి అప్పుడే మనం వాళ్లకి చెప్పే అర్హత కలిగిఉంటాము . పిల్లల పెంపకం లో తల్లి తో పాటు తండ్రీ పాత్ర ముఖ్యమే , అందులోను అబ్బాయిల విషయం లో తండ్రీ పాత్ర కు చాలా బాధ్యత ఉంది మనం ఇంట్లో వాళ్ళ తో , పిల్లల తో ఎలా ఉంటామో అన్నీ గమనిస్తారు అవే ఆచరణ లోకి పెడతారు కూడా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి . ఇక పోతే చెడు అలవాట్లు ఇలాంటి అలవాట్ల వల్లే రా ఎంతో మంది పసి పిల్లలు రోగాల బారిన పడుతున్నారు మనం సరదాకి చేస్తున్న ఈ పనులే భవిష్యత్తు లో పిల్లల పాలిట శాపాల గా మారుతున్నాయి . పొగ తాగేవాడే కాదు పీల్చే వాడికి కూడా ఆపద పొంచి ఉంది , నీ తో పాటు నీ భార్య , పిల్లల ఆరోగ్యం పణంగా పెట్టి నీ సరదా తీర్చుకుంటున్నావ్ . ఇప్పటికైనా నీ తప్పు నీకు అర్ధం అయింది అది చాలు దయచేసి ఇకపైన అయినా మానడానికి ప్రయత్నించరా " అని వాడి వైపు చూసాను జేబు లో ఉన్న సిగరెట్టు ప్యాకెట్ నలిపేస్తూ కనపడ్డాడు.

" నా వల్ల అవుతుంది అంటావా రా మానడం " అన్నాడు ప్రశ్నార్థకం గా నా వైపు చూస్తూ

" సంకల్పం ఉండాలే గానీ ఎలాంటి అలవాటు అయినా మానచ్చు ఇప్పుడు ఈ అలవాట్లు మాన్పించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి . ఒక స్నేహితుడి వల్ల కాని , భార్య వల్ల కానిది పిల్లల వల్ల సాధ్యం అయింది నీ ఆలోచన లో మార్పు వచ్చింది. పిల్లల జీవితం లో తండ్రీ పాత్ర మార్గదర్శకం గా ఉండాలి , స్ఫూర్తి దాయకం గా ఉండాలి అప్పుడే వాళ్ళ జీవితాలని చక్కదిద్దిన వాడివి అవుతావు " అంటూ శ్రీకర్ భుజం తట్టగానే నవ్వుతు ఆఫీస్ రూమ్ లోకి నడిచాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama