Baswaraj Mangali

Others

4.7  

Baswaraj Mangali

Others

ఆఖరి లేఖ

ఆఖరి లేఖ

3 mins
906


"సాహితి,ఎలా ఉన్నావు?"అని అడిగే హక్కు కూడా నాకు లేదు. నీతో మాట్లాడడానికి ముఖం చెల్లక, ఈ లేఖ రాయాల్సి వచ్చింది. నీ గురించి తలుచకున్నప్పుడు, నిన్ను చూడాలనిపిస్తుంది. నీతో తనివితీర మాట్లాడాలనిపిస్తుంది. ఒడిలో తల వాల్చి ఏడవాలని మనసు తపిస్తోంది.అప్పుడు నన్ను నేను కష్టం మీద సంబాలించుకుంటాను. ఏ పనిలో ఉన్న, ఏం చేస్తున్నా, నీ ధ్యాసే. ప్రతి ఊహలో తళుక్కుమనే వచ్చి పోతావు. రాత్రిపూట తారల. అప్పుడు ఏం చేయాలో తెలియదు. కనురెప్ప మూసి ఉన్నప్పుడు తడి మాత్రం తెలుస్తుంది. అంతే ఆ రాత్రి నిద్ర ఉండదు. నీకు తెలుసో లేదో! మనం పెంచుకునే కుక్క గుర్తుందా! "టామీ "! అది పెద్దది అయింది. దానితో సమయం గడుపుతున్నప్పుడు మన మధుర క్షణాలు గుర్తొస్తాయి.

"సాహి", నీకు తెలుసా? నిద్దరోక రేయంత చెక్కా చుక్కల్లో నీ రూపం. కాసేపు కళ్ళు తిప్పా, వేకువ వచ్చి తనతో నీ రూపు తీసుకెళ్ళింది! ఇక నాకు చీకటి మిగిలింది! చీకటే మిగిలింది.

సాయంత్రపు వేళల్లో, సంధ్యా కాంతుల్లో, వెన్నెల రాత్రుల్లో, వేడి నిట్టూర్పులలో నువ్వు గుర్తొసస్తావు. ఎందుకో తెలియదు ఏడుపొస్తుంది. కన్నీరు ఇంకి పోయినా ,గుండెల్లో బాధ ఊరుతున్నది. నిన్ను మర్చిపోవడానికి సలహా చెప్పవూ?

నీకు పెళ్లి అవుతునప్పుడు నేను ఊహించగలను. నిండుగా అలంకరించుకొని బరువైన చీరలు నగలు తగిలించచుకుంటావు . పూలజడ తో పెళ్లికి సిద్ధం అవుతావు. కానీ సాహితీ, నువ్వు అలా ఎక్కువ అలంకరించుకుంటే నాకు నచ్చదు. నువ్వు ఎక్కువ అలంకరణలు లేకుండానే బాగుంటావు తెలుసా? చిన్న బొట్టుతో, చంద్రుబింబానికి కుంకుమ అద్దినట్టుగా.

నా చాదస్తం నాది, నువ్వు పట్టించుకోకు. కొన్ని ప్రశ్నలు నాలో మిగిలి ఉన్నాయి. సమాధానం లో ఎంత వెతికినా దొరకడం లేదు. బహుశా నీ దగ్గర దొరుకుతాయేమో!

"సాహీ", కాలమే మన శత్రువా? మనం చేసిన తప్పేంటి? నా తప్పే ఉంది. అవును మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నువ్వు నాకే సొంతం అనుకునన్నాను. ప్రతి విషయంలో కట్టడి చేసి, మీ స్వేచ్ఛకు దూరం చేసి,అనుమానించాను. నిన్ను వేధించా ను. ఎందుకంటే నువ్వు నా దానవు. నాది అనుకున్నది నేను అమితంగా ప్రేమిస్తాను. నా నుండి నువ్వు దూరం కాకూడదని, అంతే. కానీ, నేను చేసింది ముమ్మాటికీ తప్పే. పంజరం లో బంధించడానికి నువ్వు చిలుకవు కాదు కదా! నా రాణివి.ఆ విషయాన్ని గ్రహించలేకపోయాను. అందుకేనేమో ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు. నిన్ను నా నుండి దూరం చేసాడు. చివరకు మనం ప్రేమించుకున్న విషయం ఇంట్లో కూడా చెప్పలేదు, ఒప్పించడానికి ధైర్యం కూడా చేయలేదు. ఒక అసమర్థడిలా, ధైర్యం లేని వాడిలా మిగిలిపోయాను,నీ దృష్టిలో. నిజమే కదా! నీకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది. నన్ను భరించావు. ముఖ్యంగా ప్రేమించావు. నువ్వు నా అదృష్టం. ఇప్పుడు నా అదృష్టం ఎవరినో వరిస్తుంది.ఎంత విధి లిఖితం,సాహితి.ప్రేమకు - ఆకర్షణకు అర్థన్ని తెలిపావు. నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైంది.

విరహం కూడా వరమనిపిస్తోంది. నీ జ్ఞాపకాలలో బ్రతికేయాలని ఉంది.నిజం!నీతో గడిపిన క్షణాలు మళ్ళీ రావేమో!గతం లోకి వెళ్లి వాటిని తనివి తీరా ఆస్వాదించాలని ఉంది. అసలు మన ప్రేమ కథ కు ఏమైంది? చాలా సంతోషంగా ఉండే వాళ్ళం. చిన్న చిన్న ఆనందాల ని కలుపుకుంటూ, రేపటి ఆశల పూల పొదరిల్లుని అల్లుకుంటూ, బ్రతికాము కదా!మరేమైంది? కన్న కలలన్ని కూలిపోయాయి. అలల తాకిడికి ఇసుక గూడు చేదిరి, సముద్రం లొ కలిసిపోయింది. ఆ గూటి ఆనవాళ్లు మాత్రం ఇంకా చెదరలేదు.నిజం చెప్పు "సాహి",నీకు నేను పొరపాటున కూడా గురుతురానా? నన్ను పూర్తిగా మర్చిపోయావా? నీ కలలో, జ్ఞాపకాలలో, పనిలో కూడ నా తలపే రాదా? పోనీ నీ ఊహలో నా ముఖమైనా గుర్తిస్తావా?

నీకు పెళ్లయితే నన్ను తలుచుకున్న పాపమే అవుతుంది తెలుసా? పిచ్చిదాన. క్షమించు సాహి, బావోద్వేగాన్ని ఆపుకోలేక పోతున్నాను. ఎం చెయ్యమంటావు? మెదడుకి నువ్వు రావని తెలిసినా, గుండెకి అది పట్టదు. ఇంకా నువ్వు నాదానివి అని భ్రమలో ఉంది.ఏడిస్తే

బాధ తగ్గాలి. కానీ, పెరుగుతుంది. నా జీవితం లో ప్రతి పేజి నువ్వై ఉండిపోయావు . ఇప్పుడు ఆ పేజీలు కాలిపోతున్నాయి. కానీ, అక్షరాలు మాత్రం నా గుండెల్లో పదిలం.

నిన్ను మరవడం అన్నది జరగదేమో.ఖచ్చితంగా.. నువ్వు కళ్ళలో కదలాడుతుంటావు. ఎందుకో తెలియదు ఏడుపొస్తుంది. గాలి కన్నీటి తాకుతూ వెళుతుంది. ఆ స్పర్శ నీ చేయిదే అనుకుంటా.ఇంత బాద ఓపలేక రాస్తున్న ఈ "ఆఖరి లేఖ ".

నాకు ప్రత్తుత్తరం కూడా పంపకు. నీ నుండి వచ్చే ఏ స్పందన కయినా నేను చెలించిపోతాను.నీ జీవితం లో వసంతాలు, దారులలో పూలు, గమ్యంలో మజిలీ చేరాలి. సుఖంగా ఉండు.ఈ లేఖ చదివిన తర్వాత ఒక్క బొట్టు కన్నీరు కార్చిన నువ్వు నన్ను క్షమించినట్టే. ఇక ఉంటా..."నాన్న "

                                                           "నీ " కానీ

                                                         వర్ధన్.



Rate this content
Log in