STORYMIRROR

Tejaswini teju

Others

4  

Tejaswini teju

Others

ప్రేమ లేఖ ♡

ప్రేమ లేఖ ♡

1 min
318


ప్రేమ లేఖ ❤️


నిన్ను చూడగానే ప్రేమ పుట్టనే లేదు ....ఎప్పుడు పుట్టిందో మరి తెలియనే లేదు 


వర్ణించే అంత అందం నీ సొంతం కాదు కదా......మరి ప్రేమ ఎలా పుట్టిందో ......


నల్లటి నీ శరీర రంగులో ఏమి అంత ప్రత్యేకత..........నీ కట్టు బొట్టులో మైమరచిపోయి అందం నా కళ్ళకి కనరలేదే ఏ పొద్దు.........


ఏమని చెప్పాను ఎంతో అందమైన నీ మనసు చూసిన నా కళ్ళకి ........ఎంత అందమైన రూపమైన ఎలా నచ్చుతుంది.........


చుట్టూ నల్లటి చీకటి లేకపోతే ఆ వెన్నెలకు అందం ఎది........ వెన్నెలకే అందం తెచ్చే చీకటిని ఏ కవి ఎందుకు వర్ణించలేదోమరి


 ఈ సాధారణ ప్రేమికుడు మాత్రం ఎలా వర్ణించగలడు.........



నీ జీవితంలో జీవితభాగస్వమి అనే పాత్ర పోషించాలి అని ఉంది .....నాకు అర్హత లేదు అని తెలుసు కానీ అందమైన మనసున్న హంస ఎవరిని భాద పెట్టాదు అనే చిన్న ఆశ




                        ఇట్లు

 హంస రాకకొరకే నిరీక్షిస్తూ జీవితాంతం ఎదురుచేసే ప్రేమికుడు


                      - తేజు 🌿








Rate this content
Log in