Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీలాకాశం

నీలాకాశం

1 min
240


తూరుపు నీలాకాశపు పొరల్లో వెలుతురు చొరబడి

చీకటి పొలిమేరల్లో వేకువ అలికిడి 

కిరణం దిద్దెను వెలుగుతో ఒరవడి

వెలుగుల సాంద్రత పడి సంద్రంలో ఉరవడి

జిలుగు వెలుగుల ధాటికి చీకటి త్వరపడి

పలాయనం చిత్తగించె వడివడి

వలస పక్షులు ఆకాశాన సాగెను త్వరపడి

మేఘమాలికలు నింగిని మూగి ఊసులాడి

నానావిధ సుమములు విరిసె ముచ్చటపడి

పచ్చదనం మంచు పొరలను విదుల్చుకుని లేచె వేగిరపడి.

భారంగా లేచిన తీరం వెచ్చని వెలుతురు తాకిడితో స్ధిమితపడి

జగతి సమాయత్తమయ్యే మరో ఉదయరాగానికి తుంబురయై శృతిచేస్తూ...........


... సిరి ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్