Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ రూపు

నీ రూపు

1 min
227


నా పెదవికి నగవొచ్చిందంటే

నీ తలపు నా మదిని విరిసినట్టే

నా చెక్కిలి ఎరుపెక్కిందంటే

నీ కొంటెసైగ గురుతొచ్చినట్టే

నా కన్నులు విచ్చుకున్నాయంటే

నీ రూపు నా ఎదురుపడ్డట్టే

నా మేను మెలిక తిరుగుతుంటే

నీ గాలి నాకు సోకినట్టే

నే మైకంలో ఉన్నానంటే

నీ ఒడిలో సేదతీరుతున్నట్టే...

... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్