Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మౌనంగా మిగిలాను

మౌనంగా మిగిలాను

1 min
262



ఒక్కొక్కసారి 

నాలోకి నేను ప్రయాణిస్తూ

జీవన సంఘర్షణల్ని 

వర్తమాన జీవిత స్థితిగతుల్ని ....

బేరీజు వేసుకుంటే 

అంతా అగమ్యగోచరం.....!!


ఆత్మీయతా మేఘాలు 

కమ్ముకుని .

ఓదార్పు జల్లుగా కురిసిన 

స్నేహబంధం 

స్వార్థపు ముసుగులో

కనుమరుగైన వైనం...!!


ప్రేమ ,అనురాగం,

ఆత్మీయత 

ఈ బ్రతుకు బజారులో 

ఎక్కడైనా దొరుకుతాయాంటే 

పుట్టడం ,బ్రతకటం 

చావడం తప్ప 

అంతా శూన్యం....!!


గతించి పోయేటి 

క్షణాల నీడలో....

"మౌనంగా మిగిలాను" 

నేను మాత్రం...!!


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్