Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాలం గుప్పెట్లో

కాలం గుప్పెట్లో

1 min
1



కదిలే కాలపు పొరల్లో

కప్పబడిన గతాలెన్నో

శిథిలమైన శిథిలాలెన్నో

కాలం నిరంతరo ఆగక 

చలించే అనంతప్రవాహిని

ఏకాలంలో ఏ ధర్మం పాటించాలో

తెలిసిన సమవర్ధిని

కాలo రాగద్వేషాలుఅంటని 

స్థితప్రజ్ఞురాలు

 నువ్వు చేసిన కర్మకు నీకు

 ఫలితం తెలియక పోవచ్చు కానీ

ఏ కర్మకు ఏ ఫలితం ఇవ్వాలో

ప్రతి గడియను విభజించి మరీ

లెక్కగట్టి ఇస్తుంది కాలం

కాలాన్ని అధిగమించి అధిరోహించాలని

కాలపు గుప్పెట్లో చిక్కకుండా

కాలపు కళ్ళాలను తన గుప్పెట్లో

చిక్కించుకోవాలని మనిషికి వెర్రిఆశ

కానీ కాలం అనంత విశ్వరూపిని

మనిషి అందులో పీపీలికమే

నువ్వనుకున్న లెక్కలు కాలానికి

కాకిలెక్కలు

తన లెక్కలు ఏవో అవి 

మాత్రమే అమలు చేసే ధర్మదేవత

అవి నువ్వు అరచి గీ పెట్టినా

చెదరని, చేరపలేని గీతలు

మనిషికి కాలాన్ని విభజించి

లెక్కించుకోవడం,కాలధర్మాన్ని

అనుసరించి నడుచుకోవడం తప్ప

కాలాన్ని బంధించికాలానికిఎదురీదడం అన్నది

ఎన్నటికీ,ఎప్పటికి జయించలేని దుర్భేద్యo

ఎందుకంటే కాలస్వరూపం ఏమిటో మానవునికి అంతుపట్టనిమహా మాయాజాలం



Rate this content
Log in