Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎదురు చూపు

ఎదురు చూపు

1 min
236


ఇక్కడే ఉండిపోయాను

నువ్వొస్తానన్నావని

పని ఒత్తిడిలో మరచిపోయావో ఏమోనని

వెళ్లిపోతే తిరిగొచ్చి కంగారుపడతావని

నీ మనసు కష్టపడకూడదని

నా గుండెలో బాధని

మోమున చిరునవ్వుగా మార్చుకుని

ఎదురుచూస్తూ

ఇక్కడే ఉండిపోయాను...

ఈ కన్నుల ఎదురుచూపు 

ఈ మేనికి మెరుపు 

ఈ మనసున తలపు 

నీ కోసమే ఈ వలపు

తలపు మైమరపు

వినిపిస్తుందా నా పిలుపు...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్