STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

4  

Midhun babu

Children Stories Fantasy Children

అమ్మ మనసు

అమ్మ మనసు

1 min
1


అమ్మ మనసుకు నిర్వచనం చెప్పలేను నేను,

ఆ అమృత హృదయాన్ని వర్ణించనూ లేను నేను.


రక్తమాంసపు తనువును 

ఆత్మీయతతో నింపేదే తానూ,

జాతిని మరచి 

సహృదయత చాటు అమ్మలోనే దైవం ఉంటుందంటాను నేను,

నిరంతరం తలపుల్లో విహరించే అమ్మనే 

మమతల కోవెలలో దేవతగా కొలవాలంటాను నేను,

కన్నులు తడిసిన

పయనం ఆగని అమ్మప్రేమే 

అనుబంధపు వాకిట పచ్చతోరణం అంటాను నేను.


రంగులలోకంలో 

ఎన్ని వర్ణాలున్నా 

అందాల హరివిల్లు 

అమ్మలో చూస్తాను నేను,

లోకమంతా అమ్మరూపే 

ప్రేమల మొలకలై దరిచేరాయి అంటాను నేను,

కర్తవ్య ప్రభోధిత 

అమ్మ ధర్మనిరతి 

జగతికి ఆదర్శం కావాలని కోరుకుంటాను నేను,

ప్రతి ప్రాణిలోని పావనహృదయం అమ్మమనసు గాక వేరేది కాదంటాను నేను,

కమ్మని అమ్మ నగుమోమును 

సదా హృదిలో దర్శించడమే వరమంటాను నేను.


Rate this content
Log in